iDreamPost

58 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చిన సిద్దూ మూసేవాలా తల్లి.. ఎందుకు..?

ప్రముఖ పాప్ సింగర్, ర్యాపర్ సిద్దూ మూసేవాలా మరణం ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. తండ్రి కళ్ల ఎదుట కుమారుడు ప్రాణాలు విడిచాడు. అతడి మరణ వార్తను జీర్ణించుకోలేకపోయింది ఆయన కుటుంబం. ఇప్పుడు అతడి తల్లి

ప్రముఖ పాప్ సింగర్, ర్యాపర్ సిద్దూ మూసేవాలా మరణం ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. తండ్రి కళ్ల ఎదుట కుమారుడు ప్రాణాలు విడిచాడు. అతడి మరణ వార్తను జీర్ణించుకోలేకపోయింది ఆయన కుటుంబం. ఇప్పుడు అతడి తల్లి

58 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చిన సిద్దూ మూసేవాలా తల్లి.. ఎందుకు..?

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దు మూసేవాలా రెండేళ్ల క్రితం గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో మరణించిన సంగతి విదితమే. అతడి మరణ వార్త అప్పట్లో పెను సంచలనంగా నిలిచింది. 2022 మే 29న తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి కారులో వెళుతుండగా..కొందరు దుండగులు అడ్డగించి కాల్పులు జరపడంతో తీవ్ర గాయలైన సిద్దూ అక్కడిక్కడే మృతి చెందిన చెందారు. సిద్దూ హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. చేతికొచ్చిన కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది.

ఇదిలా ఉంటే.. ఒక్కాగొనొక్క కొడుకును పొగొట్టుకున్న బాధలో ఉండిపోయారు సిద్దూ తల్లిదండ్రులు. కాగా, ఇప్పుడు వారి కుటుంబంలోకి మరోసారి చిరునవ్వులు రాబోతున్నాయి. సిద్దూ తల్లి చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఈ విషయం ఖరారు అయ్యింది. చరణ్ కౌర్ కు ప్రస్తుతం 58 ఏళ్లు కాగా, తండ్రి బాల్ కౌర్ సింగ్ వయస్సు 60 ఏళ్లు. వృద్ధాప్యంలో తోడు కోసం ఈ జంట బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ పద్దతి ద్వారా సిద్దూ తల్లి గర్భం దాల్చినట్లు.. చరణ్ కౌర్ సోదరుడు వెల్లడించారు. ఆమె మార్చి నెలలో డెలివరీ కానున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్లే నాలుగు,ఐదు నెలల నుండి బయటకు రావడం లేదని తెలుస్తోంది.

కాగా, సిద్దూ మూసేవాలాగా ముద్ర పడ్డ అతడి అసలు పేరు శుభ్ దీప్ సింగ్ సిద్దూ.. తన పాటలతో యువతను ఉర్రూతలూగించాడు. బంబిహా బోలే, 47 వంటి పాట అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆయన పాటలతో వివాదాస్పద సింగర్‌గా పేరుబడ్డాడు. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి చిత్రాల్లో కూడా నటించాడు. 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూ.. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కొన్ని రోజుల్లోనే అతడు మృత్యువాత పడ్డాడు. ఇదిలా ఉంటే.. సిద్దూ తల్లి అని వార్తలు రాగానే.. సోషల్ మీడియాలో మీమ్స్ ఊపందుకున్నాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన బదాయి హో చిత్రానికి పోలిన మీమ్స్ రూపొందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి