iDreamPost

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఎంత జరిగింది? టార్గెట్ ఎంతంటే?

Tillu Square Theatrical Business: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరనే జంటగా టిల్లు స్వ్కేర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tillu Square Theatrical Business: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరనే జంటగా టిల్లు స్వ్కేర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఎంత జరిగింది? టార్గెట్ ఎంతంటే?

టాలీవుడ్ లో కుర్రకారు బాగా ఎదురుచూస్తున్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది టిల్లు స్క్వేర్ అనే చెప్పాలి. డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ యువతను ఒక ఊపు ఊపేశాడు. ఇప్పటికీ రాధికా డైలాగులు, డీజే టిల్లు పాటలు ప్రతి ఈవెంట్ లో మోగుతూనే ఉంటాయి. ఈ స్టార్ బాయ్ కాస్త గ్యాప్ తీసుకుని ఈ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 29న రిలీజ్ కాబోతున్న ఈ టిల్లు స్వ్కేర్ సినిమాకి బజ్ అయితే బీభత్సంగా ఉంది. కుర్రాళ్లంతా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్ సినిమా కోసం యూత్ ఎదురుచూస్తోంది. మార్చి 29న స్టార్ బాయ్ సిద్ధు- అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవలే సెన్సార్ సట్విఫికేషన్ కూడా పూర్తైంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రోమోలు, డైలాగ్ టీజర్లు, ట్రైలర్ చూస్తే ఈ మూవీలో కాస్త రొమాన్స్ కూడా డబుల్ గానే ఉంటుందని అంతా భావించారు. టిల్లు- లిల్లీ బాండింగ్ పై ఆడియన్స్ అంచనాలు ఎక్కువే పెట్టుకున్నారు. కానీ, సెన్సార్ సర్టిఫికేషన్ చూసిన తర్వాత వారి ఆశలు కాస్త నీరుగారి పోయాయి.

Tillu square

ఇంక ఈ విషయాలు పక్కన పెడితే సినిమా పరంగా మాత్రం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. టిల్లుగాడి టార్గెట్ ఎంత? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి అధికారికంగా ఆన్సర్ దొరక్కపోయినా.. ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఒక అంకె వైరల్ అవుతోంది. టిల్లు స్క్వేర్ సినిమాకి రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరిగింది అంటున్నారు. స్టార్ బాయ్ సిద్ధుకి ఇది పెద్ టార్గెట్ అయినా కూడా.. సినిమాకి ఉన్న బజ్, టిల్లు మీద నమ్మకం చూస్తే.. దీనిని ఈజీగానే రీచ్ అవుతుందని చెప్తున్నారు.

టిల్లుకి ఒక చిన్న గండం ఉంది. అదే రోజు గాడ్జిల్లా * కాంగ్: న్యూ ఎంపైర్ సినిమా రిలీజ్ అవుతోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ 16 ఏళ్లు కష్టపడిన ఆడు జీవితం సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. అంతకాకుండా వారం గ్యాప్ లో విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ఉంది. టిల్లు స్క్వేర్క్ కి పాజిటివ్ టాక్ వస్తే ఆ సమయం సరిపోతుంది. మేకర్స్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని ధీమాగా ఉన్నారు. అలాగే ఆడియన్స్ కి కూడా టిల్లు మీద నమ్మకం కాస్త ఎక్కువగానే ఉంది. మరోవైపు టిల్లు స్క్వేర్ ఓటీటీకి కూడా మంచి డిమాండ్ ఉంది అని చెప్తున్నారు. ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడవుతాయని చెప్తున్నారు. మరి.. టిల్లు స్క్వేర్ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.35 కోట్లు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి