iDreamPost

గుజరాత్ కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన గిల్! ఏమన్నాడంటే?

  • Author Soma Sekhar Published - 08:17 AM, Thu - 30 November 23

టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ కు గుజరాత్ టైటాన్స్ జట్టు సారథ్య పగ్గాలు అందించడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక కెప్టెన్ కావడంపై తొలిసారి స్పందించాడు గిల్.

టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ కు గుజరాత్ టైటాన్స్ జట్టు సారథ్య పగ్గాలు అందించడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక కెప్టెన్ కావడంపై తొలిసారి స్పందించాడు గిల్.

  • Author Soma Sekhar Published - 08:17 AM, Thu - 30 November 23
గుజరాత్ కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన గిల్! ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఈ ఇటీవల క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటనలు రెండే రెండు. అందులో ఒకటి వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి అయితే.. రెండోది గుజరాత్ టీమ్ ను వదిలి పాండ్యా ముంబై కి వెళ్లడమే. ఐపీఎల్ లో ఆడిన తొలి సీజన్ లోనే జట్టును విజేతగా, తర్వాత ఎడిషన్ లో రన్నరప్ గా నిలిపిన పాండ్యాను గుజరాత్ వదులుకోవడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. ఇదీకాక.. టైటాన్స్ జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ కు సారథ్య పగ్గాలు అందించడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఇక గుజరాత్ జట్టుకు కెప్టెన్ కావడంపై తొలిసారి స్పందించాడు శుబ్ మన్ గిల్.

శుబ్ మన్ గిల్.. అతి తక్కువ కాలంలోనే జాతీయ జట్టులోకి దూసుకొచ్చిన యువ సంచలనం. తన అద్భుతమైన ఆటతీరుతో టీమ్ లో సుస్థిర స్థానం దక్కించుకున్నాడు. ఇక పాండ్యా ముంబై టీమ్ కు వెళ్లడంతో అనూహ్యంగా కెప్టెన్ గా ఎన్నికైయ్యాడు గిల్. గుజరాత్ జట్టులో కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ.. వారందరిని కాదని కెప్టెన్సీ పదవి గిల్ ను వరించింది. ఈ క్రమంలోనే తనకు సారథ్య పగ్గాలు రావడంపై తొలిసారి స్పందించాడు.

శుబ్ మన్ గిల్ మాట్లాడుతూ..”నేను గుజరాత్ కెప్టెన్ అన్న ఫీలింగ్ నాకు ఇంకా మనసులోకి ఎక్కడం లేదు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడేవరకు ఇది ఇలాగే ఉంటుంది. ఇక ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు నాకు 7-8 సంవత్సరాలు ఉంటాయి. క్రికెట్ ఆడాలనుకునే ప్రతీ యువకుడికి, ఐపీఎల్ ఆడే ప్రతీ ప్లేయర్ కు ఇలాంటి జట్లకు సారథ్యం వహించాలనేది ఓ డ్రీమ్” అంటూ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు. ఇలాంటి అవకాశం దొరికినందుకు చాలా సంతోషడుతున్నానని తెలిపాడు గిల్. అయితే కెప్టెన్సీతో పాటుగా డిసిప్లిన్, హార్డ్ వర్క్, కమిట్ మెంట్, లాయాల్టీ లాంటి విషయాలు ఒక నాయకుడికి ఎంతో ముఖ్యమని గిల్ వివరించాడు. మరి శుబ్ మన్ గిల్ గుజరాత్ కెప్టెన్ కావడంపై, అతడి స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి