iDreamPost

అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్‌!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్‌!

స్టార్‌ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శృతి హాసన్‌. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. కేవలం నటిగానే కాకుండా.. సింగర్‌గా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటారు. సినిమాల పరంగా ఎలాంటి వివాదాలు లేని శృతి హాసన్‌.. వ్యక్తిగతంగా తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనారోగ్యం.. లవ్‌ ఎఫైర్ల విషయంలో ఆమె పేరు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. ఇప్పుడు శృతి హాసన్‌ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

శృతి హాసన్‌ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. ఆ వ్యాధి కారణంగా ఆమె విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారట. ఆ ఒత్తిడి కారణంగా తరచుగా కోపానికి గురవుతున్నారట. ఆ కోపంలో ఇతరులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారట. ఆ తర్వాత వారిపై అరిచినందుకు బాధపడుతున్నారట. ప్రస్తుతం ఆమె ఒత్తిడిని తగ్గించుకునే పనిలో పడ్డారంట. ఒత్తిడి బాగా పెరిగినపుడు పాటలు వింటూ ఉంటారట. ఇక, శృతి బాధపడుతున్న ఈ వ్యాధి గురించి తెలిసిన నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.

కాగా, శృతి హాసన్‌.. ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’ సినిమాలో నటించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇక, నాని 30వ సినిమాలోనూ శృతి హాసన్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు శృతి ‘ది ఐ’ అనే ఓ ఇంగ్లీష్‌ సినిమాలోనూ నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతి హాసన్‌.. సోషల్‌ మీడియాను రెగ్యులర్‌గా వాడతారు. తనకు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తూ ఉంటారు. మరి, శృతికి ఉన్న ఈ అరుదైన వ్యాధిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి