iDreamPost

Shivam Dube: రంజీ మ్యాచ్ లో చెలరేగిన దూబే.. టెస్టులకూ సిద్దమంటూ సవాల్!

టీ20ల్లోనే కాదు.. టెస్టుల్లోనూ అదరగొట్టాడు టీమిండియా పేస్ ఆల్ రౌండర్ శివమ్ దూబే. తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే ఇన్నింగ్స్ తో తాను టెస్టులకూ సిద్ధమేనంటూ.. సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.

టీ20ల్లోనే కాదు.. టెస్టుల్లోనూ అదరగొట్టాడు టీమిండియా పేస్ ఆల్ రౌండర్ శివమ్ దూబే. తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే ఇన్నింగ్స్ తో తాను టెస్టులకూ సిద్ధమేనంటూ.. సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.

Shivam Dube: రంజీ మ్యాచ్ లో చెలరేగిన దూబే.. టెస్టులకూ సిద్దమంటూ సవాల్!

టీమిండియాలో ఎంతో మంది యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. ఇంకా దూసుకొస్తున్నారు కూడా. అయితే కొన్ని రోజులుగా భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం ఒక్కటే.. అదే శివమ్ దూబే. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో దుమ్మురేపాడు దూబే. ఆల్ రౌండ్ ఫర్ఫామెన్స్ తో ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డునే దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో వరుసగా రెండు అర్ధ శతకాలు సాధించడమే కాకుండా రెండు మ్యాచ్ ల్లోనూ నాటౌట్ గా నిలిచాడు ఈ పేస్ ఆల్ రౌండర్. కాగా.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే ఇన్నింగ్స్ తో తాను టెస్టులకూ సిద్ధమేనంటూ.. సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.

శివమ్ దూబే.. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా వెలుగొందుతున్నాడు. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంలో దూబే కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో థండర్స్ ఇన్సింగ్స్ లతో అర్దశతకాలతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ పేస్ ఆల్ రౌండర్. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేరళ-ముంబై మధ్య శుక్రవారం మెుదలైన ఈ మ్యాచ్ తొలిరోజు ఆటలో శివమ్ దూబే ఆటనే హైలెట్. సహచర బ్యాటర్లు విఫలమైన వేళ.. టెయిలెండర్ల సహకారంతో.. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి విధ్వంసం సృష్టించాడు దూబే. 72 బంతుల్లో 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

shivam dube superb batting

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై టీమ్ కు ఆదిలోనే షాకిచ్చాడు బాసిల్ థంపి. తొలి ఓవర్ లోనే ఓపెనర్ జై గోకుల్ బిస్తాను ఔట్ చేయడమే కాకుండా.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహానేను కూడా గోల్డెన్ డక్ చేశాడు. దీంతో కష్టాల్లో పడింది ముంబై. ఈ సమయంలోనే లల్వానీ(50), దూబే(51), తనూష్ కొటైన్(56) పరుగులతో రాణించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ముంబై 251 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు 51 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు దూబే. దీంతో తాను టెస్టులకు కూడా సిద్దమేనంటూ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. త్వరలోనే సంప్రదాయ క్రికెట్ లోకి అడుగుపెట్టేందుకు అడుగులు వేస్తున్నాడు ఈ పేస్ ఆల్ రౌండర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సత్తా చాటుతున్న దూబేను త్వరలోనే టెస్ట్ జట్టులో చూడటం ఖాయంగానే ఉంది. మరి రంజీల్లోనూ సత్తా చాటుతున్న దూబేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి