iDreamPost

శివాజీకి యావర్ ఎదురు తిరుగుతున్నాడా?

బిగ్ బాస్ హౌస్ లో ఆట మరింత ఆసక్తిగా మారేలా ఉంది. గురు శిష్యులు అయిన శివాజీ- ప్రిన్స్ యావర్ ఇప్పుడు శత్రువులు అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. అందుకు పెద్ద కారణమే ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో ఆట మరింత ఆసక్తిగా మారేలా ఉంది. గురు శిష్యులు అయిన శివాజీ- ప్రిన్స్ యావర్ ఇప్పుడు శత్రువులు అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. అందుకు పెద్ద కారణమే ఉంది.

శివాజీకి యావర్ ఎదురు తిరుగుతున్నాడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట మరింత ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే హౌస్ లో 9 వారాల ఆట పూర్తైంది. తాజాగా హౌస్ నుంచి ఎంటర్ టైనర్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. నాగులు వారాలు ఉంటాను అనుకున్న తేజా 9 వారాలు ఉన్నందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. తనకు జీవితంలో వచ్చిన అద్భుతమైన అవకాశంగా చెప్పుకొచ్చాడు. ఇంక హౌస్ లో ఆట చూసుకుంటే.. గురు శిష్యుల మధ్య పెద్ద వివాదమే ఏర్పడింది. అది ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ల మధ్య యుద్ధమే జరగబోతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే చెప్పాలి. ఈరోజు ఇద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటే.. రేపటి రోజు వాళ్లు పెద్దగా గొడవ పడుతూ కనిపించవచ్చు. ఈరోజు తిట్టుకున్నారని వాళ్లు సీజన్ మొత్తం అలాగే ఉంటారు అని చెప్పడానికి లేదు. అదే పరిస్థితి ఇప్పుడు శివాజీ- యావర్ మధ్య కనిపిస్తోంది. కెప్టెన్సీ కోసం ఎవరు గేమ్ ఆడాలి? అనే సమయంలో గౌతమ్ తో శివాజీకి గొడవ జరిగింది. అందుకని యావర్ ని ఆడొద్దని చెప్పి శివాజీ మాత్రం అర్జున్ బ్యాగ్ తీసుకుని ఆడాడు. అయితే యావర్ తరఫున శివాజీ ఆడకపోగా.. తనకు ఉన్న అవకాశాన్ని పోగొట్టాడు అని యావర్ గట్టిగానే హర్ట్ అయ్యాడు. అందుకే శివాజీపై గుర్రుగా ఉన్నాడు.

ఇప్పటికీ వారి మధ్య సంబంధాలు మెరుగైనట్లు కనిపించట్లేదు. ఆదివారం ఎపిసోడ్లో సామెతల బోర్డుల టాస్కు ఇవ్వగా.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం? అనే సామెతను శివాజీకి వేశాడు యావర్. ఇది చూసిన తర్వాతే వారి మధ్య చెడింది అని వస్తున్న కామెంట్లకు బలం చేకూరినట్లు అయింది. ఇప్పటివరకు యావర్ ఎప్పుడూ శివాజీ చెప్పిన మాట దాటలేదు. పైగా ఆ రోజు తప్పుకోమన్న రోజు కూడా శివాజీ చెప్పాడు అని వెంటనే ఏం మాట్లాడకుండా యావర్ తప్పుకున్నాడు. కానీ, శివాజీ అలా ఒకరి ఆటను తీసేయడం కూడా కరెక్ట్ కాదనే చెప్పాలి. ఆ సందర్భంలో నలుగురితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుండేది. గౌతమ్ తనని అనుమానిస్తాడనే ఒకే ఒక కారణంతో యావర్ ని గేమ్ దూరం చేశాడు. అందుకే యావర్ కి అది మనసులో బలంగా నాటుకుపోయింది.

ఇది ఇలాగే కొనసాగితే వారి మధ్య దూరం పెరగడం మాత్రమే కాదు.. యుద్ధం కూడా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. పైగా నాగార్జున మాట్లాడుతూ.. వ్యక్తుల మీద నుంచి ఫోకస్ ఆట మీద పెట్టు అన్నారు. అంటే రతికా, ప్రశాంత్, శివాజీ ఇలా వీళ్ల నుంచి కాస్త దూరంగా జరిగి యావర్ ఇండివిడ్యూవల్ గా గేమ్ స్టార్ట్ చేస్తే హౌస్ లో ఆట మరింత ఆసక్తిగా మారే ఆస్కారం ఉంటుంది. అయితే వీళ్ల మధ్య దూరం ఇలాగే కొనసాగుతుందా? ప్రశాంత్ చొరవ తీసుకుని కలిపే ప్రయత్నం చేస్తాడా? తెలియాలి అంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే. మరి.. శివాజీ- యావర్ మధ్య దూరం పెరగబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి