iDreamPost

Ranji Trophy 2024: శార్ధూల్ ఠాకూర్ సంచలనం.. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు!

రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో దుమ్మురేపాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్. అస్సాంతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 6 వికెట్లు తీసి ప్రత్యర్ధిని బెంబేలెత్తించాడు.

రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో దుమ్మురేపాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్. అస్సాంతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 6 వికెట్లు తీసి ప్రత్యర్ధిని బెంబేలెత్తించాడు.

Ranji Trophy 2024: శార్ధూల్ ఠాకూర్ సంచలనం.. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు!

రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. యంగ్ ప్లేయర్లతో పాటుగా సీనియర్ ప్లేయర్లు సత్తాచాటుతున్నారు. తాజాగా అస్సాం వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. తన సంచలన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టాడు. దీంతో అస్సాం జట్టు కేవలం 84 పరుగులకే చాపచుట్టేసింది.

శార్ధూల్ ఠాకూర్.. టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌతాఫ్రికా టూర్ లో గాయపడిన అతడు ఇండియాకు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని రంజీ ట్రోఫీలో ముంబై టీమ్ తరఫున బరిలోకి దిగాడు. తన బౌలింగ్ సత్తా ఏంటో అస్సాం ప్లేయర్లకు రుచి చూపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్థి జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడు. అద్భుతమైన బాల్ తో పర్వేజ్ ముషారఫ్(2)ను బౌల్డ్ చేసి వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఏ బ్యాటర్ ను కూడా నిలదొక్కుకోనివ్వలేదు ఠాకూర్. నిప్పులు చెరిగే బంతులతో అస్సాం టాపార్డర్, మిడిలార్డర్ ను కాకావికలం చేశాడు.

ఈ ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు వేసిన అతడు కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. శార్ధూల్ ధాటికి 84 పరుగులకే కుప్పకూలింది అస్సాం టీమ్. జట్టులో అభిషేక్ థాక్రీ 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లార్డ్ శార్ధూల్ కళ్లు బైర్లు కమ్మే బంతులతో ప్రత్యర్థి ప్లేయర్లను పెవిలియన్ కు క్యూ కట్టేలా చేశాడు. వచ్చిన వారిని వచ్చినట్లుగానే డ్రస్సింగ్ రూమ్ కు పంపాడు ఈ మేటి బౌలర్. మరి 21 పరుగులకే 6 వికెట్లు తీసిన శార్ధూల్ ఠాకూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Varun Aaron: బుమ్రాలా వెలిగిపోవాల్సిన భారత బౌలర్ రిటైర్మెంట్! ఏమి సాధించకుండానే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి