iDreamPost

షణ్ముక్ కేసు నేనే చూస్తున్నాను.. ఏం సంబంధం లేదు ఋజువులు ఉన్నాయి: కళ్యాణ్ సుంకర

యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్స్లుయెన్సర్ షణ్ముఖ్ జస్వంత్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతడికీ కేసును టేకప్ చేశారు ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర.

యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్స్లుయెన్సర్ షణ్ముఖ్ జస్వంత్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతడికీ కేసును టేకప్ చేశారు ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర.

షణ్ముక్  కేసు నేనే చూస్తున్నాను.. ఏం సంబంధం లేదు ఋజువులు ఉన్నాయి: కళ్యాణ్ సుంకర

ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడిన సంగతి విదితమే. షణ్ముఖ్ సోదరుడి కోసం వెళితే.. అనూహ్యంగా ఇతడు పట్టుబడ్డాడని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్.. తనను మోసం చేశాడంటూ మౌనిక అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రశ్నించేందుకు సంపత్ ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులకు.. షన్ను డ్రగ్ తీసుకుంటూ కనిపించడంతో.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు  తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. కాగా, ఈ కేసును టేకప్ చేశారు ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర.

కాగా, ఈ కేసు గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసు తాను చూస్తున్నానని, షణ్ముక్ పై వస్తున్న మీడియా కథనాలకు ఎటువంటి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు దిలీప్.‘యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ,ఆయన సోదరుడు సంపత్ వినయ్ కేసు నేను చూస్తున్నాను. షన్ను తండ్రి నా వద్దనే ఉన్నారు. షణ్ముక్ పై మీడియాలో వస్తున్న కథనాలకు వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదు. అన్ని ఆధారాలు పోలీస్ వారికి సమర్పిస్తున్నాం. మరిన్ని వివరాలు విపులంగా తెలియజేస్తాను’ అంటూ పేర్కొన్నారు. కాగా, ఓ నెటిజన్ ‘అక్కడ ఏం జరిగింది అని డాడీకీ, నీకు ఎలా తెలుసు.. మీరు అక్కడ లేరు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక నువ్వు చెప్పేది ఎవరు నమ్ముతారు బ్రదర్’ ప్రశ్నించగా.. దానికి కూడా సమాధానం ఇచ్చాడు కళ్యాణ్.

‘నేను అతని సంస్థకు కొన్ని ఏళ్ళుగా లీగల్ అడ్వైజర్, అతని అపార్ట్మెంట్ వీడియోస్ మొత్తం బయటకు తీశాం. అన్ని వివరాలు మరి కాసేపట్లో పోలీసులే చెప్తారు. షన్ను తండ్రి అప్పారావు నా ఆఫీస్‌లోనే ఉన్నారు. అన్ని వివరాలు నాకు ఇచ్చారు. షణ్ముక్ నాకు 4 ఏళ్లుగా పరిచయం’ అంటూ సమాధానం ఇచ్చారు. డాక్టర్ మౌనిక అనే యువతి.. షన్ను యూట్యూబ్ లో అవకాశం ఇస్తానంటూ మోసం చేశాడని, అతడి సోదరుడు సంపత్ వినయ్ తనకు 2015 నుండే తెలుసునని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సంపత్ తో తనకు ఎంగేజ్ మెంట్ జరగ్గా.. తాము పలుమార్లు ఇంటిమేట్ అయ్యామని, ఓ సారి అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది.

 మరో ఆరు రోజుల్లో తనతో పెళ్లి పెట్టుకుని, మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని క్లంప్లయింట్ చేసింది మౌనిక. ఆ ఫిర్యాదు ఆధారంగా సంపత్ వినయ్ ఇంటికి వెళ్లి చూడగా.. షన్ను మత్తు పదార్దాలు తీసుకుంటూ దొరికిపోయాడు. ఇద్దర్ని అరెస్టు చేసి.. వేర్వేరు కేసులు బనాయించారు పోలీసులు. ఇప్పుడు  ఈ కేసు టేకప్ చేశారు ప్రముఖ లాయర్  కళ్యాణ్ సుంకర. తమ వద్ద అన్ని రుజువులు ఉన్నాయని, అతడికి ఈ కేసుకు సంబంధం లేదంటూ.. చెబుతున్నారు. మరీ ఈ కేసు ఎటు మలుపు తీసుకుంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి