iDreamPost

OTTలోకి బోల్డ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’! ఎక్కడ? ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

  • Author Soma Sekhar Updated - 11:34 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:34 PM, Thu - 2 November 23
OTTలోకి బోల్డ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’! ఎక్కడ? ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

రోజులు మారుతున్న కొద్ది మనిషి ఆలోచనలు కూడా మారుతుంటాయి.మారాలి కూడా. ఇక ఈ మార్పు అన్ని రంగాలకూ వర్తిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ ఈ మార్పును కాస్త త్వరగానే గమనించినట్లున్నారు. అందుకే సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు సైతం తెరకెక్కిస్తున్నారు. కరోనా తర్వాత వెబ్ సిరీస్ లకు గిరాకీ బాగా పెరిగింది. దాంతో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలా ప్రేక్షకులు తాజాగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ‘సైతాన్’. ట్రైలర్ తోనే ఈ వెబ్ సిరీస్ బీభత్సమైన బజ్ ను క్రియేట్ చేసుకుంది. మరి ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? ఏ రోజు నుంచి కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహి. వి. రాఘవ. ఓవైపు సినిమాలు తెరకెక్కిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా చేసుకొస్తున్నాడు. ఇటీవలే ‘సేవ్ ది టైగర్స్’ అనే ఫుల్ లెంగ్త్ కామెడీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా సైతాన్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ముందుకొస్తున్నాడు. ఇక సైతాన్ వెబ్ సిరీస్ ట్రైలర్ తోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. బూతులు, బోల్డ్ సిన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ సిరీస్ లో. అయితే సమాజంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగానే ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు డైరెక్టర్ వి.రాఘవ పేర్కొన్నాడు.

ఇక రిలీజ్ కు ముందే ఎంతో హైప్ ను క్రియేట్ చేసిన సైతాన్ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్ని ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్ గా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. జూన్ 15 నుంచి డిస్నిప్లస్ హాట్ స్టార్ లో ‘సైతాన్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది. ఇక రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన సైతాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్, హింస, బూతులు ఎక్కువగా ఉన్నాయని డైరెక్టర్ ముందే ప్రేక్షకులకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడే ఫ్యాన్స్ కు ఈ వెబ్ సిరీస్ మంచి వినోదాన్ని పంచుతుందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. 9 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 25-35 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి