iDreamPost

సీరం నుంచి చిన్నారుల వ్యాక్సిన్

సీరం నుంచి చిన్నారుల వ్యాక్సిన్

కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు. చైనా, అమెరికాలో కేసులు ఉన్నా.. ఇండియాలో ఇప్పటివరకు అయితే ఓకే.. అందుకు కారణం అందరూ టీకా తీసుకోవడమే. దాదాపు అందరూ రెండు డోసులు.. కొందరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. క్రమ క్రమంగా పిల్లలకు కూడా టీకా వేస్తున్నారు. దానికి సంబంధించి నిర్దేశిత సమయంలో వయస్సును నిర్ణయించి మరీ వేస్తున్నారు.

చిన్నారుల టీకా విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో గల చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. సీరం సంస్థ కోవిడ్ కోసం రూపొందించిన రెండో వ్యాక్సిన్ ఇది. పెద్దవారి కోసం ఇంతకుముందు ‘కోవీషీల్డ్’ రూపొందించిన సంగతి తెలిసిందే. చిన్నారుల కోసం కోవోవాక్స్ తయారు చేసింది. ఇది 12-17 ఏళ్లలోపు పిల్లలపై పనిచేస్తుంది.

ఈ వ్యాక్సిన్ భారత దేశంతోపాటు యూరప్‌లో వినియోగిస్తున్నామని అదర్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్ 90 శాతం సమర్ధంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ చొరవ వల్ల ఈ వ్యాక్సిన్ తయారీ సాధ్యమైందని పూనావాలా చెప్పారు. దేశంలోని చిన్నారులకు కోవిడ్ నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

గతేడాది కరోనా వల్ల అధిక ప్రాణ నష్టం జరిగింది. సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో ఎక్కువగా ఉంది. తర్వాత థర్డ్ వేవ్ వచ్చింది కానీ అంతగా ప్రభావం లేదు. ఫోర్త్ వేవ్ జూన్ నుంచి అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి