iDreamPost

దంగల్ నటి సుహానా పోస్ట్ మార్టంలో సంచలన నిజాలు! ఇందుకే చనిపోయిందా?

Suhani Bhatnagar Post Mortem Report: ‘దంగల్’ మూవీలో బబిత కుమారిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహనీ భట్నాగర్‌ అరుదైన వ్యాధితో కన్నుమూయడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Suhani Bhatnagar Post Mortem Report: ‘దంగల్’ మూవీలో బబిత కుమారిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహనీ భట్నాగర్‌ అరుదైన వ్యాధితో కన్నుమూయడం అందరినీ షాక్ కి గురి చేసింది.

దంగల్ నటి సుహానా పోస్ట్ మార్టంలో సంచలన నిజాలు! ఇందుకే చనిపోయిందా?

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చెటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్స్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. హార్ట్ ఎటాక్, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. కొంతమంది చిన్న వయసులోనే కన్నుమూస్తున్నారు.  2016 బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దంగల్ మూవీలో బబిత కుమారిగా నటించిన బాలనటి సుహానీ భట్నాగర్ అరుదైన వ్యాధితో చిన్న వయసులోనే కన్నుమూయడం అందరి హృదయాలను కలచి వేసింది. వివరాల్లోకి వెళితే..

2016లో ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా ‘దంగల్’ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీలో అమీర్ ఖాన్ మహావీర్ సింగ్ ఫోగాట్ పాత్రలో నటించారు. దంగల్ మూవీలో బబిత కుమారి పాత్రలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ 19 ఏళ్ల వయసులో చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. సుహానీ భట్నాగర్ మరణానికి కారణం అరుదైన ఇన్ఫ్లమేటరీ కారణం అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం సుహానీకి ‘డెర్మాటోమయోసిటిస్’ వ్యాధి లక్షణాలు కనిపించగా.. పదిరోజుల క్రితమే వ్యాధి నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా ఆమెను ఫిబ్రవరి 7న ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. వ్యాధి విషమించడంతో చికిత్స పొందుతూనే ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచినట్లు కన్నీటి పర్యంతం అయ్యారు.

సుహానీ భట్నాగర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి పలు సంచలన విషయాలు వెల్లడించారు వైద్యులు. సుహానీ భట్నాగర్ డెర్మాటోమయోసిటిస్ అనే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడిందని, ఊపిరి తిత్తులు ఇన్ ఫెక్షన్ కి గురై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి చనిపోయినట్లు వివరించారు. ఇప్పటికే ఆమె చాలా నరకం అనుభవించిందని భవిష్యత్ లో మరింత ఇబ్బందులు ఎదర్కోవాల్సి వచ్చేదని డాక్టర్లు అన్నారు. ఈ వ్యాధి చాలా అరుదైనదని.. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు, ఏడుగురు మాత్రమే ఉంటారని తెలిపారు. ఈ వ్యాధి ఏ వయసులో వారికైనా రావొచ్చని అన్నారు. దంగల్ మూవీ తర్వాత సుహానీ ‘బల్లే ట్రూప్’ మూవీలో నటించింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చినా.. అన్నీ పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించింది. చదువు పూర్తయిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉండగా.. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. ఏది ఏమైనా ఇంత 19 ఏళ్ల వయసులో నటి సుహానీ ప్రాణాలు విడవటం సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి