iDreamPost

వందకు పైగా సినిమాలు చేసిన అశ్వినీ.. అనాథలా ఎందుకు మరణించింది?

కొంత మంది హీరోయిన్లు తెరకు, ఈ లోకానికి దూరమైన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తిండిపోతుంటారు. ఆ కోవలోకి వస్తుంది ఈ నటి కూడా. వందకు పైగా సినిమాలు చేసింది అన్నమాటే కానీ.. అన్ని పోగొట్టుకుంది. చివరకు..

కొంత మంది హీరోయిన్లు తెరకు, ఈ లోకానికి దూరమైన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తిండిపోతుంటారు. ఆ కోవలోకి వస్తుంది ఈ నటి కూడా. వందకు పైగా సినిమాలు చేసింది అన్నమాటే కానీ.. అన్ని పోగొట్టుకుంది. చివరకు..

వందకు పైగా సినిమాలు చేసిన అశ్వినీ.. అనాథలా ఎందుకు మరణించింది?

సినిమా అంటే పిచ్చి.. ఫ్యాషన్‌తో ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొద్ది మంది మాత్రమే తమ నటనతో ఆకట్టుకున్నారు. భౌతికంగా ఆ నటీమణులు దూరమైన.. చిరకాలం అభిమానుల గుండెల్లో గుర్తుండిపోతుంటారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. నటనతో అలరించి వెండితెరపై చెరగని ముద్రగా నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో అశ్విని కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన అమ్మడు.. 90ల్లోనే తెలుగులో నటించడం మానేసింది. ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చతెలుగు భామ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది.

సుమారు వందకు పైగా సినిమాల్లో నటించి.. రూపాయి కూడా వెనకేసుకోలేకపోయింది. చివరకు అనాథలా మరణించింది. అశ్విని చనిపోయాక.. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు మరో స్టార్ నటుడు సాయం చేయాల్సి వచ్చింది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అంత హైట్స్ చూసిన నటి.. చివరకు చాలా ఘోరమైన స్థితిలో మరణించింది. 1967 జులై 14న పుట్టిన అశ్విని.. తొలుత సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవలో చైల్ట్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత చదువులపై శ్రద్ధ పెట్టింది. ఇంటర్ చదువుతుండగానే.. ఓ తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో మలయాళం, తెలుగులో వరుస ఛాన్సులు రావడం స్టార్ అయ్యాయి.

Aswini

అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, అత్తగారు స్వాగతం, దొర బిడ్డ, కొంటే కాపురం, త్రిమూర్తులు, భానుమతి గారి మొగుడు, అమెరికా అబ్బాయి, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, పెళ్లి చేసి చూడు, ప్రేమ కిరీటం, వేగు చుక్క-పగటి చుక్క, స్టేషన్ మాస్టర్, గోపాలరావ్ గారి అబ్బాయి, కొడుకు దిద్దిన కాపురం, పూల రంగడు, భార్యా భర్తల భాగోతం, ఆఖరి క్షణం, రక్త జ్వాల వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది. అయితే ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రముఖ రచయిత పువియరుసు మనవడితో రహస్య వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. భర్త ఆమెను మోసం చేశాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.

ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంది. భర్త మోసం చేశాడని తట్టుకోలేకపోయిన అశ్విని.. మానసికంగా కుంగ్రిపోయింది. తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెళ్లేంది. పేరుకు పెద్ద హీరోయిన్నే కానీ.. ఆమె ఏ ఆస్తులు కూడ బెట్టలేదు. చెన్నైలో ఓ ఇల్లు మాత్రమే ఉండేదట. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులకు గురై అది కూడా అమ్మేసిందని వార్తలు వచ్చాయి. అద్దె ఇంట్లో ఉంటూ.. జీవించసాగింది. 2012లోరీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.. ఆమె అనారోగ్య సమస్యలతో 2012 సెప్టెంబర్ 23న మరణించింది. 45 ఏళ్లకే నూరేళ్ల జీవితాన్ని చూసింది. ఆమె చనిపోయినప్పుడు స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేకపోతే.. తమిళ హీరో పార్తీబన్ సాయం అందించాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించాడు. ఇలా ఓ వెలుగు వెలిగిన ధ్రువతార.. అనాధలా వెళ్లిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి