iDreamPost

గుర్తు పట్టలేకుండా మారిపోయిన సీనియర్‌ నటుడు సుధాకర్‌.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

  • Published Jun 17, 2023 | 6:12 PMUpdated Jun 17, 2023 | 6:12 PM
  • Published Jun 17, 2023 | 6:12 PMUpdated Jun 17, 2023 | 6:12 PM
గుర్తు పట్టలేకుండా మారిపోయిన సీనియర్‌ నటుడు సుధాకర్‌.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

సీనియర్‌ నటుడుసుధాకర్‌.. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ.. ఓ 10, 15 ఏళ్ల క్రితం వరకు టాలీవుడ్‌లో ఆయన స్టార్‌ నటుడు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించాడు. తనకంటూ ప్రత్యేకమైన మేనరిజంతో.. విభిన్న రకాల పాత్రలు చేసి.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు సుధాకర్‌. ఇక ఈ సోషల్‌ మీడియా యుగంలో.. సెలబ్రిటీలకు సంబంధించి తప్పుడు వార్తలు నిమిషాల్లో వైరల్‌ అవుతుంటాయి. అలానే కొన్ని రోజుల క్రితం సుధాకర్‌ గురించి తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన మృతి చెందారంటూ.. వార్తలు రావడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ క్రమంలో తాజాగా సుధాకర్‌.. ఓ టీవీ చానెల్‌లో నిర్వహించిన షోకి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇక ఆయనను చూసిన ప్రేక్షకులు.. అస్సలు గుర్తు పట్టలేకపోయారు. ఏంటి సార్‌ ఇలా మారిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సినిమాలో హీరో, హీరోయిన్లకు ధీటుగా కొందరూ నటీనటులు గుర్తింపు తెచ్చుకుంటారు. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధాకర్‌. సుమారు 45 ఏళ్ల పాటు.. ప్రేక్షకులని అలరించారు సుధాకర్‌. అబ్బబ్బబ్బా, పిచ్చ కొట్టుడు కొట్టాడు,టేచల్ టేచల్ టేచల్ వంటి డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరించారు సుధాకర్‌. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో కలిసి.. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ‍క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆయన చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఆయనే స్వయంగా స్పందించారు. అవి తప్పుడు వార్తలని.. తాను బతికే ఉన్నానని అన్నారు.

ఈ క్రమంలో ఫాదర్స్ డే (జూన్ 18) సందర్భంగా జీ తెలుగులో ‘నేను నాన్న’ అనే స్పెషల్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు సుధాకర్ కనిపించి తన పాపులర్‌ డైలాగ్‌లు చెప్పి ప్రేక్షకులను నవ్వించారు. అయితే సుధాకర్‌ పూర్తిగా మారిపోయారు. టక్కున చూస్తే.. ఆయనను గుర్తు పట్టడం కష్టం. అంతలా మారిపోయారు. అభిమాన నటుడిని అలా చూసిన ప్రేక్షకులు కంట తడి పెట్టుకున్నారు. తమ అభిమాన నటుడిని మరోసారి చూసే అవకాశం కల్పించిందినందుకు థాంక్స్‌ చేబుతున్నారు ప్రేక్షకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి