iDreamPost

ఆ రెండు చైనా కంపెనీ కిట్లను వెనక్కు పంపండి – రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఆ రెండు చైనా కంపెనీ కిట్లను వెనక్కు పంపండి – రాష్ట్రాలకు కేంద్రం సూచన

బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ICMR రాష్ట్రాలకు సరఫరా చెసిన కోవిడ్ -19 యాంటీబాడీ టెస్ట్ కిట్‌లను రెండు రోజుల పాటు వాడటం మానేయాలని కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ప్రకటన జారీ చేసింది. గువాంగ్‌జౌ వాండ్‌ఫో బయోటెక్ మరియు జుహై లివ్జోన్ డయాగ్నోస్టిక్స్ అనే ఈ రెండు చైనా కంపెనీల నుండి రాష్ట్రాలకు అందిన కిట్లను ఉపయోగించడం మానేసి వెంటనే తిరిగి ICMRకి పంపాలని ఇవి తమ పరిశోధనలో తయారీదారులు ఇచ్చిన హామీకి తగ్గట్టుగా ఫలితాలు ఇవ్వటంలేదని తేలిందని, కావున వీటిని తిరిగి సదరు తయారీదారులకు తిప్పి పంపబోతునట్టు చెప్పుకొచ్చారు.

మరొక ప్రకటనలో కోవిడ్ 19 యొక్క రోగ నిర్ధారణకు RT-PCR గొంతు లేదా నాసిక శుభ్రపరచు పరీక్ష ఉత్తమమైనదని, పాజిటివ్ కేసులను గుర్తించడానికి ఇది ఉత్తమ మార్గం” అని ICMR పేర్కొంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్ర సహాయం లేకుండానే కొరియా నుండి ఏకంగా ఒక్కసారే లక్ష కిట్లను దిగుమతి చేసుకుని అత్యంత వేగంగా నిమషాల వ్యవధిలో వ్యాధిని నిర్ధారించే విధంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ కొరియా కిట్ల ఆధారంగా రోజుకు సగటున 8వేల మందికి టెస్టులు చేస్తూ నిన్నటికి 68,034 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.

దీంతో దేశంలొనే అత్యంత వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ ముందు వరసలొ ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొరియా కిట్ల ఆధారంగా పకడ్బందిగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్న భారత ప్రధాని మోడి కొరియా నుండి ఏకంగా లక్షల కిట్లను ఆర్డర్ ఇవ్వడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి