iDreamPost

Sedition Law ‘రాజద్రోహం చట్టం’ అమలుపై స్టే, సుప్రీం కీలక నిర్ణ‌యం

Sedition Law  ‘రాజద్రోహం చట్టం’ అమలుపై స్టే, సుప్రీం కీలక నిర్ణ‌యం

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు సంచ‌న‌ల‌ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధించింది. ఈ చట్టాన్ని ప్ర‌స్తుతానికి నిలుప‌ద‌ల చేస్తున్న‌ట్లు బుధవారం నాటి తీర్పులో వెల్లడించింది. రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకోవచ్చని సూచించింది. అంతేకాదు, రాజద్రోహం చ‌ట్టం కింద కొత్త‌గా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని తేల్చేసింది.

రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలన్న‌ సుప్రీం కోర్టు, సెక్షన్‌ 124A కింద నమోదైన కేసులన్నింటినీ తిరిగి విచారించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. బ్రిటిష్‌ కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? లేదంటే ఆ చట్టం కింద కేసుల్లో నమోదైన ప్ర‌జ‌ల‌ ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా, పెండింగ్‌ కేసులన్నింటినీ అప్ప‌టిదాకా పక్కన పెడతారా? దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది.

రాజద్రోహం చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర ప్ర‌భుత్వం కోర్టుకు స్పష్టం చేసినందున‌ ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీం తీర్పునిచ్చింది. ఈ చట్టాన్ని సమీక్షించే వరకూ స్టే విధించింది. అంటే అప్పటివరకూ ఈ చట్టం కింద కేసులు ప్ర‌భుత్వం కొత్తగా న‌మోదు చేయ‌లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి