iDreamPost

Lasya Nanditha: లిప్ట్‌లో ఇరుక్కుపోయిన MLA లాస్య నందిత..

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు లాస్య నందిత. ఈమె దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె. ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు లాస్య నందిత. ఈమె దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె. ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

Lasya Nanditha: లిప్ట్‌లో ఇరుక్కుపోయిన MLA లాస్య నందిత..

సామాన్యులే కాదూ.. సెలబ్రిటీలను కూడా ఊహించని ప్రమాదాలు ఆందోళన కలిగించేలా చేస్తాయి. ఒక్కొక్కసారి ఇలాంటి ప్రమాదాలు ప్రాణం మీదకు కూడా తెస్తుంటాయి. ఇలాంటి చేదు అనుభవాలు జీవితాంతం గుర్తిండిపోయేలా చేస్తాయి. తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే ఇలాంటి అనుభవాన్నే చవిచూశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. బోయనపల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లగా.. ఆమె లిఫ్ట్ ఎక్కారు. అయితే ఆ సమయంలో లిఫ్ట్‌లోకి ఎక్కువ మంది ఎక్కేసరికి.. ఓవర్ లోడ్ అయ్యే అయ్యింది. వెంటనే లిఫ్ట్ కిందకు జారిపోయింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగుల గొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు.

బోయినపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యే లాస్య నందిత. ఈ క్రమంలో పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఆమెతో పాటు మరికొంత మంది మహిళలు ఆ లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్నారు. అంతలో ఓవర్ లోడ్ కావడంతో లిఫ్ట్ కిందకు జారి పోయింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్ కింద ఫ్లోర్‌కు వెళ్లిపోవడంతో కంగారు పడ్డారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు లిఫ్ట్ లో ఉన్న లాస్య, ఆమె స్నేహితులు, బంధువులు. వెంటనే సిబ్బంది.. లిఫ్ట్ తలుపులను పగులగొట్టి.. ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తెనే ఈ లాస్య నందిత. సాయన్న మరణించడంతో ఆ స్థానం నుండి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

2016లో కవాడిగూడ నుండి లాస్య నందిత కార్పొరేటర్‌గా గెలిచారు. కాగా, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అప్పటి నుండి తన తండ్రి సాయన్న వెంటే ఉంటూ నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె, కిడ్నీ సంబంధింత సమస్యలతో సాయన్న మృతి చెందారు. ఆయన చనిపోవడంతో..ఆ నియోజకవర్గం టికెట్ పై బీఆర్ఎస్ నేతలు కొందరు తమ ప్రయత్నాలు చేయగా.. కేసీఆర్ మాత్రం నందితపై నమ్మకం ఉంచి సీటు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు లాస్య నందిత. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలాంటి ఊహించని ప్రమాదాల నుండి మీరు తప్పించుకున్నట్లయితే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి