iDreamPost

వీడియో: కోటిలో ఒకరికి వచ్చే వ్యాధి.. అవయవాలను తినేసే డేంజరస్ డిసీజ్

భయంకరమైన వ్యాధి. ఒక్కసారి సోకితే శరీరంలో ఉన్న అవయవాలని తినేస్తుంది. ఈ వ్యాధి కోటిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది.

భయంకరమైన వ్యాధి. ఒక్కసారి సోకితే శరీరంలో ఉన్న అవయవాలని తినేస్తుంది. ఈ వ్యాధి కోటిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది.

వీడియో: కోటిలో ఒకరికి వచ్చే వ్యాధి.. అవయవాలను తినేసే డేంజరస్ డిసీజ్

మనిషి రూపాన్ని మార్చేసే శక్తి దేనికీ లేదు అని అనుకుంటాం. కానీ వృద్ధాప్యానికి ఆ శక్తి ఉంటుంది. వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ దశల వారీగా మనిషి రూపం అనేది మారుతుంటుంది. అయితే మనిషిని గుర్తుపట్టనంతగా మార్చేసే శక్తి ఒక్క వ్యాధికి మాత్రమే ఉంటుంది. కొన్ని వ్యాధులు మనుషుల్ని మానసికంగా, శారీరకంగా బాధపెడతాయి. కోట్లాది మందిలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధులు ఉన్నాయి. ఆ మధ్య సమంత మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడేవారు. సమంతలానే చాలా మంది హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడేవారు. క్యాన్సర్ లాంటి మహమ్మారి మొదలు అనేక రకాల వ్యాధులు అనేక మందిలో ఒక పీడ కలలా మారిపోయాయి. అలాంటి వాటిలో స్కెలో డెర్మా వ్యాధి ఒకటి. 

ఈ వ్యాధి వస్తే చర్మం బిగుసుకుపోయి బండరాయిలా మారిపోతుంది. నెర్వల్ సిస్టం, బోన్ సిస్టం, శరీరంలో ఉండే అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతాయి. చేతులు నీలంగా మారిపోవడం, డైజెషన్ తక్కువ అవ్వడం, గోర్లు చీలిపోవడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలన్నీ వాణి అనే అమ్మాయి అనుభవించారు. ఈమె యూఎస్ లో ఎంఎస్ చేశారు. వీళ్ళు నివసించే ఏరియాలో ఈమె అందగత్తె. సినిమా హీరోయిన్ చాలా అందంగా ఉండేవారు. అలాంటి ఆమె అందాన్ని కోల్పోవడమే కాకుండా జీవాన్ని కోల్పోయారు. శరీరంలో అవయవాలు ఉన్నాయన్న పేరుకే గానీ పాడైపోయాయని వాణి వెల్లడించారు. టెన్త్ క్లాస్, ఇంటర్ చదివే రోజుల్లో బానే ఉండేదాన్నని.. ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళినప్పుడు ఈ వ్యాధి బయటపడిందని అన్నారు.

A girl trying to make her beauty from google

ఈ వ్యాధి బయటపడ్డాక తన ముక్కు షేప్ మారిపోయింని.. కళ్ళు చిన్నగా అయిపోయాయని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా శరీరంలో చాలా మార్పులు జరిగాయని అన్నారు. రెండేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని.. యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ చల్లని వాతావరణానికి వ్యాధి ముదిరిందని అన్నారు. విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేవని.. నల్లగా అయిపోవడం, జుట్టు పల్చబడడం , శరీరంలో అవయవాలు ఒక్కొక్కటిగా పాడవుతూ వచ్చాయని అన్నారు. యూఎస్ లో డాక్టర్స్ ని సంప్రదిస్తే వారు సైతం ఆశ్చర్యపోయారని.. అయితే క్లినికల్ ట్రయల్స్ వేయాలని చెప్పడంతో భయపడి అక్కడ నుంచి వచ్చేసానని అన్నారు.

ఇక్కడ టీవిలో డాక్టర్ కోటేశ్వరరావు ఇంటర్వ్యూని చూసి ఆయనను సంప్రదించానని అన్నారు. తనకు స్కెలో డెర్మా డిసీజ్ ఉందని వాణి వెల్లడించడంతో.. ఈ వ్యాధి గురించి పూర్తిగా స్టడీ చేశానని డాక్టర్ కోటేశ్వరరావు అన్నారు. తాను అప్పటికే చేస్తున్న రీసెర్చ్ ఈ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగపడుతుందని భావించానని అన్నారు. ఆ తర్వాత ఈ వ్యాధి నయమవుతుందని వాణికి హామీ ఇచ్చానని అన్నారు. దీనిపై వాణి తండ్రి మాట్లాడుతూ.. ఇది లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి అని.. గూగుల్ లో ఎవరో ఏదో రీసెర్చ్ చేశారని ఆ మందులు వాడడంతో ఇలా వ్యాధి ముదిరిందని అన్నారు. ఈ వ్యాధికి సంబంధించి వాణి పడుతున్న బాధలు.. మెడిసన్ వాడాక ఆమె ఎలా కోలుకుంటున్నారు.. వంటి వివరాలు కింది వీడియోలో వారి మాటల్లోనే వినండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి