iDreamPost

టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు రూ.30 వేల LIC స్కాలర్‌షిప్

టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు రూ.30 వేల LIC స్కాలర్‌షిప్

ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులను విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ పేరుతో ఆర్థికంగా ప్రొత్సాహం ఇస్తుంది. ప్రతిభ కలిగి చదువుకోలేని విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుంటుంది. అయితే ఈ క్రమంలోనే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) విద్యార్థులకు తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ పేరుతో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు రూ.30 వేల స్కాలర్ షిప్ ను అందిస్తున్నట్లుగా ప్రకటించింది. 10వ తరగతి పాస్ అయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. మరి ఈ స్కాలర్ షిప్ పొందాలంటే వీరు ఎలా అప్లయ్ చేసుకోవాలి? అర్హతలు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

టెన్త్ పాస్ అయిఇంటర్ లో చేరిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. టెన్త్ లో కనీసం 60 శాతం మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఈ స్కాలర్ షిప్ కు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 3 లక్షల 60 వేల లోపు ఉండాలి. అయితే ఈ స్కాలర్ షిప్ తల్లిదండ్రులు లేని పిల్లలు, దివ్యాంగులు, బాలికలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇక అప్లయ్ చేయదలిచిన వారు ప్రవేశం పొందిన కాలేజ్ గుర్తింపు కార్డు, టెన్త్ మార్క్స్ షీట్, ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి పత్రాలతో Buddy4Study అనే పోర్టల్ ద్వారా అప్లయ్ చేయాలని పేర్కొన్నారు. ఇలా దరఖాస్తు చేసిన వారు ఇంటర్ ఫస్టియర్ కు రూ.15 వేలు, రెండవ సంవత్సరానికి రూ.15 వేలు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు.. టెన్త్ పాస్ అయి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు వెంటనే అప్లయ్ చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి