iDreamPost

నిమ్మగడ్డ కేసు, స్టే కి నిరాకరించిన సుప్రీంకోర్టు

నిమ్మగడ్డ కేసు, స్టే కి నిరాకరించిన సుప్రీంకోర్టు

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ పై నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగింపు విషయంలో స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హై కోర్ట్ తీర్పు పై విచారణ కు సంబ్బంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల విషయంలో మొదలయిన వివాదం కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ అర్హతలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం, దరిమిలా నిమ్మగడ్డ స్థానంలో జస్టిస్ కనగ రాజ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ వేసిన పిటిషన్ లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. అయితే అక్కడ ప్రభుత్వానికి ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ ఈ కేసు విచారణ కొనసాగించేందుకు సిద్ధం చేశారు. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని చెబుతూ నోటీసులు ఇచ్చారు. దాంతో ఈ తీర్పు ఆసక్తికరంగా మారింది.

ఏపీ ప్రభుత్వ తరుపున వేసిన పిటిషన్ పై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది.విచారణ జరిపిన వారిలో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏ. ఎస్.బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ఉన్నారు.కేసులో తదుపరి విచారణ కోసం ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీచేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి