iDreamPost

సత్తా చాటిన సరిలేరు – 2 వారాల కలెక్షన్లు

సత్తా చాటిన సరిలేరు – 2 వారాల కలెక్షన్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో కఠినమైన పోటీని తట్టుకుని భారీ వసూళ్లు దక్కించుకుంది. మూడో వారంలోకి అడుగు పెట్టే సమయానికి 115 కోట్ల షేర్ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. థియేట్రికల్ బిజినెస్ పెట్టుబడి మొత్తం వచ్చేసినట్టే. ఇకపై వచ్చేదంతా లాభాల కిందే లెక్క వేసుకోవచ్చు. ముఖ్యంగా నైజాంలో మహేష్ తన సత్తా గట్టిగా చాటాడు. అక్కడ ఏకంగా 30 కోట్లకు పైగా షేర్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు.

సినిమాలో కంటెంట్ మీద తొలుత కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఫైనల్ గా అందులోని కామెడీ, మహేష్ చాలా రోజుల తర్వాత వేసిన మాస్ అవతారం, అనిల్ రావిపూడి టేకింగ్ ఇవన్ని విన్నర్ రేస్ లో నిలబెట్టాయి. ఓవర్సీస్ లో ఎక్కువ రికార్డులు ఆశించిన సరిలేరు నీకేవ్వరుకు అల వైకుంఠపురములో వల్ల కాస్త వెనుకబడక తప్పలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సై అంటే సై అనేలా వసూళ్లు రాబట్టింది, ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు ఏ ఫిగర్ దగ్గర ఆగుతుందో దాన్ని బట్టి ఎవరిదో పై చేయో డిసైడ్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న హీరొయిన్ కాగా తమన్నా చేసిన పార్టీ సాంగ్ మరో ఆకర్షణగా నిలిచింది.

Checkout area wise 2 weeks collections:

AREA SHARE
నైజం  30.60cr
సీడెడ్  14.30cr
ఉత్తరాంధ్ర  14.75cr
గుంటూరు  8.15cr
క్రిష్ణ  7.05cr
ఈస్ట్ గోదావరి  9.35cr
వెస్ట్ గోదావరి  6.95cr
నెల్లూరు  3.70cr
ఆంధ్ర తెలంగాణా  94.85cr
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా  9.25cr
ఓవర్సీస్  11.60cr
ప్రపంచవ్యాప్తంగా   115.70cr

బ్లాక్ బాస్టర్ హిట్ 

( GST రిటర్న్స్ మినహా )

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి