iDreamPost

Sarfaraz Khan: మళ్లీ రెచ్చిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌! టీమిండియాకు మరో స్టార్‌ దొరికినట్టేనా..?

  • Published Feb 18, 2024 | 1:42 PMUpdated Feb 18, 2024 | 1:42 PM

సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ మొదలైనప్పటి నుంచి ఇండియన్‌ క్రికెట్‌లో మారుమోగిపోతున్న పేరు. చాలా కాలం నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ కుర్రాడు.. రెచ్చిపోయి ఆడుతున్నాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ మొదలైనప్పటి నుంచి ఇండియన్‌ క్రికెట్‌లో మారుమోగిపోతున్న పేరు. చాలా కాలం నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ కుర్రాడు.. రెచ్చిపోయి ఆడుతున్నాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 18, 2024 | 1:42 PMUpdated Feb 18, 2024 | 1:42 PM
Sarfaraz Khan: మళ్లీ రెచ్చిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌! టీమిండియాకు మరో స్టార్‌ దొరికినట్టేనా..?

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియా పటిష్టంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగితే.. తొలి మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్‌ అయిన సర్ఫరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే టెంపోను కొనసాగించి.. 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలతో రాణించి సూపర్‌ స్టార్‌ అందుకున్నాడు. దీంతో సర్ఫరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇంతకాలం దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌ జాతీయ జట్టులో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాడు. ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ఎట్టకేలకు సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా అందుకున్నాడు ఈ యువ క్రికెటర్‌. తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఆటగాడికి ఇది చాలా మంచి ఆరంభం. పైగా తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్‌ కాకపోయి ఉంటే.. సర్ఫరాజ్‌ కచ్చితంగా సెంచరీ చేసే వాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా టైమ్‌ ఉంటే కూడా సెంచరీ మార్క్‌ అందుకునే వాడు. అతను ఆడుతున్న విధానం చూస్తే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేయడం పెద్ద విషయం కాదు. కానీ, బ్యాడ్‌ లక్‌ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా తప్పిదం కారణంగా రనౌట్‌.. రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడంతో నాటౌట్‌గా మిగిలాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జడేజా సెంచరీలతో రాణించారు. సర్ఫరాజ్‌ హాఫ్‌ సెంచరీ బాదాడు. ఇక ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమిండియా.. 126 పరుగుల లీడ్‌ అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి ఆడిన భారత్‌.. ఏకంగా 430 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దీంతో.. ఇంగ్లండ్‌ ముందు 557 పరుగులు భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో దుమ్మరేపాడు. శుబ్‌మన్‌ గిల్‌, సర్ఫరాజ్‌ హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. గిల్‌ దురదృష్టవశాత్తు రనౌట్‌ అవ్వడంతో సెంచరీ మిస్‌ అయ్యాడు. ఇంకా ఒకటిన్నర రోజు ఆట మిగిలి ఉంది. మ్యాచ్‌ గెలవాలంటే.. ఇండియాకు 10 వికెట్లు కావాలి. ఇంగ్లండ్‌కు 557 పరుగులు కావాలి. టీమిండియాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. మరి తొలి మ్యాచ్‌ ఆడుతూ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుత హాఫ్‌ సెంచరీలతో రాణించిన సర్ఫరాజ్‌ ఖాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి