iDreamPost

బీజెపీలోకి పార్టీని విలీనం చేసిన స్టార్ హీరో..!

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో రాజకీయాలు వేడెక్కడమే కాదూ.. సమీకరణాలు మారిపోతున్నాయి.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో రాజకీయాలు వేడెక్కడమే కాదూ.. సమీకరణాలు మారిపోతున్నాయి.

బీజెపీలోకి పార్టీని విలీనం చేసిన స్టార్ హీరో..!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. పలు రాష్ట్రాలో రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటికి తోడు.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి కూడా కేంద్రంలో తిరిగి అధికారాన్ని చేపట్టాలని బీజెపీ ఊవిళ్లూరుతోంది. ఎక్కడిక్కడ పావులు కదుపుతూనే ఉంది. అధికార పార్టీ వ్యూహాలు.. ప్రతిపక్షాల ఎత్తుగడల మధ్య వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో.. వైసీపీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన పొత్తుతో పాటు బీజెపీ కూడా జత అయ్యింది. అలాగే తమిళనాడులో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తమిళనాడులోని కమల్ పార్టీ.. మక్కల్ నీథి మయ్యం.. అధికార డీఎంకేలో చేరింది.

ఇప్పుడు మరో స్టార్ హీరో తన పార్టీని బీజెపీలో విలీనం చేశారని తెలుస్తోంది. ఇంతకు అతడు ఎవరంటే.. తమిళ స్టార్ నటుడు ఆర్ శరత్ కుమార్. ఆయన నేతృత్వంలోని ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చి (AISMK) మంగళవారం.. బీజెపీలో విలీనమైంది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘ ఇది ప్రజల కోసం, దేశం కోసం తీసుకున్న నిర్ణయం. దేశ ప్రయోజనాల కోసమే పనిచేయాలని అనుకుంటున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల గర్వంగానూ.. సంతోషంగా ఉన్నా’ అని పేర్కొన్నారు శరత్ కుమార్. ఎన్నికల విలీనం నేపథ్యంలో శరత్ కుమార్ సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Tamil hero sarathkumar party with BJP

2007లో AISMK పార్టీని స్థాపించిన శరత్ కుమార్.. అన్నాడీఎంకే కూటమితో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసి.. రెండు సీట్లు సాధించి.. రాష్రంలో తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీని విలీనం చేసినట్లు తెలుస్తోంది. శరత్ కుమార్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. బాడీ బిల్డర్ నుండి జర్నలిస్టుగా.. ఆ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేశారు. తెలుగులో సమాజంలో స్త్రీ అనే మూవీతో కెరీర్ స్టార్ అయ్యింది. విలన్ నుండి హీరోగా మారి.. స్టార్ అయ్యారు. ఛాయ అనే మహిళను వివాహం చేసుకున్న ఆయన.. 2000లో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తెనే.. ప్రస్తుత స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. 2001లో ఒకప్పటి స్టార్ నటి రాధికను వివాహం చేసుకున్నారు శరత్. ఇక 18వ లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ నుండి మే మధ్యలో జరిగే అవకాశాలున్నాయి. 17వ లోక్ సభ పదవీకాలం జూన్‌తో ముగియనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి