iDreamPost

సంజూ శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్.. వారికి వార్నింగ్!

  • Author singhj Published - 05:32 PM, Sat - 21 October 23

వరల్డ్ కప్​ టీమ్​లో చోటు దక్కలేదనే బాధలో ఉన్న సంజూ శాంసన్ మరోమారు తన ప్రతాపాన్ని చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్​తో హెచ్చరికలు పంపాడు.

వరల్డ్ కప్​ టీమ్​లో చోటు దక్కలేదనే బాధలో ఉన్న సంజూ శాంసన్ మరోమారు తన ప్రతాపాన్ని చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్​తో హెచ్చరికలు పంపాడు.

  • Author singhj Published - 05:32 PM, Sat - 21 October 23
సంజూ శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్.. వారికి వార్నింగ్!

క్రికెట్​లో ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే తామేంటో నిరూపించుకొని కెరీర్​ను సుదీర్ఘ కాలం కంటిన్యూ చేస్తారు. టాలెంట్​ను ఎప్పటికప్పుడు సానబెట్టుకొని, కొత్త టెక్నిక్స్​ను నేర్చుకుంటూ, గేమ్​ను ఇంప్రూవ్ చేసుకునే వారే ఎక్కువ కాలం క్రికెట్​లో కొనసాగగలరు. అవకాశాలు వచ్చినా సరిగ్గా వినియోగించుకోలేని వారి పని ఇక అంతే అని చెప్పాలి. ఎందుకుంటే టాలెంటెడ్ ప్లేయర్స్ ఎందరో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఛాన్స్ మిస్సయితే ఇక మళ్లీ ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.

డొమెస్టిక్ లెవల్లో బాగా ఆడి పేరు తెచ్చుకున్న సంజూ శాంసన్​.. ఐపీఎల్​ ద్వారా లైమ్ లైట్​లోకి వచ్చాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్, టైమింగ్ భలేగా ఉంటుంది. సంజూ ఫామ్​లో ఉంటే అతడి బ్యాటింగ్ చూస్తూ ఉండిపోవాలంతే. అంత బాగా షాట్స్ కొడతాడు సంజూ. అయితే నిలకడలేమి అతడికి పెద్ద సమస్యగా మారింది. అడపాదడపా మంచి ఇన్నింగ్స్​లు ఆడతాడు తప్పితే కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడంలో సంజూ ఫెయిల్ అవుతున్నాడు. క్రీజులో సెటిల్ అయ్యాక భారీ ఇన్నింగ్స్ వస్తుందని అనుకునే టైమ్​లో చెత్త షాట్ ఆడి సంజూ వికెట్ పారేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. టీమిండియా తరఫున ఆడే ఛాన్స్ వచ్చినా అతడు సద్వినియోగం చేసుకోలేదు. వాస్తవానికి భారత టీమ్ మేనేజ్​మెంట్ సంజూకు ఎక్కువ ఛాన్సులు ఇవ్వలేదు.

వచ్చిన అరకొర అవకాశాలను శాంసన్ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో రీసెంట్​గా జరిగిన ఆసియా కప్, ఆసీస్​తో వన్డే సిరీస్ సహా వన్డే వరల్డ్ కప్-2023లోనూ అతడికి టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో సంజూతో పాటు అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. సెలెక్టర్లపై, టీమ్ మేనేజ్​మెంట్ మీద సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంజూ బ్యాట్​తో అదరగొట్టాడు. చండీగఢ్​తో జరిగిన మ్యాచ్​లో కేవలం 32 బంతుల్లోనే 52 రన్స్ చేసి తన బ్యాట్​కు ఇంకా పవర్ తగ్గలేదని నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన అతడి ఫ్యాన్స్.. ఇది సెలెక్టర్లకు సంజూ పంపిన వార్నింగ్ అంటున్నారు. మరి.. సంజూ శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇంత సాధించినా.. సచిన్ కన్నా కోహ్లీ గొప్ప అని ఎందుకు ఒప్పుకోలేం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి