iDreamPost

Sanju Samson: శతకంతో చెలరేగిన సంజూ శాంసన్.. మాట నిలబెట్టుకున్నాడుగా!

సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్.

సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్.

Sanju Samson: శతకంతో చెలరేగిన సంజూ శాంసన్.. మాట నిలబెట్టుకున్నాడుగా!

సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్. తనదైన బ్యాటింగ్ తో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేసి.. జట్టుకు మంచి స్కోర్ ను అందించాడు. ఒకవైపు ప్రోటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీస్తూ.. టీమిండియాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాటికి ఎదురొడ్డి వన్డే కెరీర్ లో తొలి శతకంతో మెరిశాడు శాంసన్. అతడికి అండగా.. నిలుస్తూ తిలక్ వర్మ(52) అర్ద సెంచరీతో రాణించాడు. ఇక సంజూ శాంసన్ తనకు సెలెక్టర్లు ఇచ్చిన లక్కీ ఛాన్స్ ను అద్భుతంగా ఉపయోగించుకుని, శతకం బాది మాటనిలబెట్టుకున్నాడు.

సంజూ శాంసన్.. ఈ పేరుకు టీమిండియాలో ఓ క్రేజ్ ఉంది. అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ.. అనుకున్న అవకాశాలు రాక, వచ్చిన వాటిని సరిగ్గా ఉపయోగించుకోక జట్టులో ప్లేస్ కోల్పోయాడు ఈ కేరళ బ్యాటర్. ఈ క్రమంలోనే బీసీసీఐ సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో గోల్డెన్ ఛాన్స్ కింద ఓ అవకాశం ఇచ్చింది. దాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు శాంసన్. సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 110 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇక ఇది శాంసన్ కెరీర్ లో తొలి వన్డే శతకం కావడం విశేషం. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సంజూ.. ప్రోటీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. శాంసన్ సెంచరీతో భారత్ 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంతకు ముందు తిలక్ వర్మ సైతం 52 పరుగులతో రాణించాడు. ఇక నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. జట్టులో సంజూ శాంసన్ (108), తిలక్ వర్మ(52), రింకూ సింగ్(38) పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరన్ హెండ్రిక్స్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మరి కీలక మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి