iDreamPost

నేను అన్‌లక్కీ క్రికెటర్‌ని కాదు! సంచలన వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్‌

  • Published Nov 24, 2023 | 6:54 PMUpdated Nov 24, 2023 | 6:54 PM

సంజు శాంసన్‌.. యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌. ఐపీఎల్‌లో ఓ టీమ్‌కి కెప్టెన్‌. కానీ, టీమిండియాలో మాత్రం అతనికి అవకాశాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇప్పుడైతే.. అతను మళ్లీ తిరిగి టీమిండియాలోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో అతను రోహిత్‌ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సంజు శాంసన్‌.. యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌. ఐపీఎల్‌లో ఓ టీమ్‌కి కెప్టెన్‌. కానీ, టీమిండియాలో మాత్రం అతనికి అవకాశాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇప్పుడైతే.. అతను మళ్లీ తిరిగి టీమిండియాలోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో అతను రోహిత్‌ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 24, 2023 | 6:54 PMUpdated Nov 24, 2023 | 6:54 PM
నేను అన్‌లక్కీ క్రికెటర్‌ని కాదు! సంచలన వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్‌

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ సంజు శాంసన్‌ చాలా పాపులర్‌ క్రికెటర్‌. టాలెంట్‌కు ఏం మాత్రం కొదవలేకపోయినా.. దురదృష్టం విపరీతంగా ఉన్న ఆటగాడు. ఎప్పుడో 2015లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. అడపాదడపా అవకాశాలు మినహా.. ఇప్పటికీ జట్టులో తన ప్లేస్‌ను పర్మినెంట్‌ చేసుకోలేకపోయాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం సంజును ఎంపిక చేయకపోవడంపై క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పించారు. సూర్య కంటే సంజు శాంసన్‌ బెటర్‌ వన్డే ప్లేయర్‌ అని, అతన్ని కాదని సూర్యను ఎలా ఎంపిక చేస్తారంటూ పెద్ద రచ్చ జరిగింది. సంజు కోసం క్రికెట్‌ అభిమానులు తిరువనంతపురంలో ఇండియా మ్యాచ్‌లు ఆడే సమయంలో నిరసన కూడా తెలియజేశారు. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడకపోయినా.. సంజుకు బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు ఎంపిక చేయకపోవడం సంగతి అటుంచితే.. తాజాగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం కూడా సంజును సెలెక్టర్లు పట్టించుకోలేదు. అతన్ని ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేస్తారని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, వారందరికి నిరాశ మిగిల్చారు సెలెక్టర్లు. దీంతో.. మరోసారి సంజు శాంసన్‌ పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సంజుకు అన్యాయం జరుగుతుందని, అతను పెద్ద అన్‌లక్కీ క్రికెటర్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొన్నారు. కొంతమంది అయితే.. సంజును రిటైర్‌ అయిపోమని కూడా కోరుతూ.. వాళ్ల ఆగ్రహాన్ని వెల్లగక్కారు. సంజును ఎంపిక చేయకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో.. సంజు శాంసన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ముఖ్యంగా తనను టీమిండియాకు ఎంపిక చేయకపోవడం, అలాగే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో తనకున్న అనుబంధం గురించి కూడా సంజు మాట్లాడాడు. నిజానికి తనను అంతా అన్‌లక్కీ క్రికెటర్‌ అంటూ ఉంటారని.. కానీ, నేను అన్‌లక్కీ క్రికెటర్‌ను కాననీ, ఈ స్థాయిలో ఉంటానని నేను ఎప్పుడూ కనీసం అనుకోలేదని, అలాంటిది ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాతో మాట్లాడే, మొదటి లేదా రెండో వ్యక్తి అని పేర్కొన్నాడు. నాతో వచ్చి రోహిత్‌ భాయ్‌ మాట్లాడాతాడని, బాగా ఆడుతున్నావ్‌ అంటూ అంటాడని, తనకు రోహిత్‌ శర్మ నుంచి మంచి సపోర్ట్‌ ఉందని సంజు శాంసన్‌ పేర్కొన్నాడు. మరి రోహిత్‌ నుంచి తనకు సపోర్ట్‌ ఉందని సంజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి