iDreamPost

Sanju Samson: సెంచరీ చేయడం గర్వంగా ఉంది కానీ.. శాంసన్ ఎమోషనల్!

సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో వన్డేలో సెంచరీతో సత్తా చాటాడు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్. ఇక తన శతకంపై మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో వన్డేలో సెంచరీతో సత్తా చాటాడు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్. ఇక తన శతకంపై మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Sanju Samson: సెంచరీ చేయడం గర్వంగా ఉంది కానీ.. శాంసన్ ఎమోషనల్!

సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ నెగ్గడంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ రాకపోగా.. రెండో మ్యాచ్ లో తక్కువ పరుగులే చేసి నిరాశపరిచాడు ఈ కేరళ బ్యాటర్. అయితే కీలకమైన మూడో వన్డేలో అనూహ్యంగా శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలోనే తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకుని పలు రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. కాగా.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ, తన శతకంపై ఎమోషనల్ అయ్యాడు. తాను సెంచరీ సాధించడం గర్వంగా ఉంది.. కానీ అంతకంటే మరోకటి తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు.

సంజూ శాంసన్.. గత కొంత కాలంగా టీమిండియాలో కంటిన్యూస్ గా వినిపిస్తున్న పేరు. దానికి కారణం ఏంటో కూడా మనందరికి తెలిసిందే. అద్భుత ఆటతీరు కనబరుస్తున్నప్పటికీ.. జట్టులో చోటు మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు సంజూ. సెలెక్టర్లు అతడిపై సీతకన్ను వేయడంతో.. జాతీయ జట్టుకు కొంత కాలం దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కోసం అతడిని తుది జట్టులోకి తీసుకున్నారు. లక్కీ ఛాన్స్ అందుకున్న శాంసన్, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెడుతూ.. కీలక మ్యాచ్ లో సెంచరీతో చెలరేగి టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించాడు.

Samson's emotional century

ఇక మ్యాచ్ అనంతరం తన సెంచరీపై ఎమోషనల్ గా స్పందించాడు. సంజూ శాంసన్ మాట్లాడుతూ..”మానసికంగా, శారీరకంగా ఎన్నో రోజులు పడిన కష్టానికి ప్రతిఫలం ఇది. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాను. కీలకమైన మ్యాచ్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించడం మరచిపోలేని విషయం. ఇక ఈ ఫార్మాట్ లో క్రీజ్ లో కుదురుకోవడానికి కొద్దిగా టైమ్ పడుతుంది. బౌలర్ల మైండ్ సెట్ ను, పిచ్ ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదీకాక టాపార్డర్ లో రావడం వల్ల ఎక్కువగా బంతులు ఆడటానికి వీలుకలుగుతుంది. అయితే సెంచరీ చేయడం నాకు గర్వంగా ఉన్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం మరింత సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ బ్యాటర్.

ఈ సందర్భంగా టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు శాంసన్. దేశమంతా తిలక్ వర్మ బ్యాటింగ్ తీరుపై గర్వపడుతోంది. అతడు అద్భుతంగా ఆడాడని సంజూ తెలిపాడు. కాగా.. రెండు రోజులకు ఒకసారి ప్రయాణిస్తూ మ్యాచ్ లు ఆడటం కఠిన సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నాడు. అయితే సీనియర్ల సూచనలను పాటిస్తూ.. యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ కితాబిచ్చాడు సంజూ శాంసన్. ఇక ఈ మ్యాచ్ లో సంజూ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకోగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సాధించాడు యువ బౌలర్ అర్షదీప్. అతడు మూడు వన్డేల్లో 10 వికెట్లు తీసి సత్తాచాటాడు. మరి సెంచరీ తర్వాత శాంసన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి