iDreamPost

తన కెరీర్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులను వెల్లడించిన సందీప్ వంగా

  • Published Feb 03, 2024 | 2:33 PMUpdated Feb 03, 2024 | 2:33 PM

ఇరు పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోల అభిమానులు అందరూ తమ తమ హీరోలు సందీప్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం, సందీప్ ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పై దృష్టి పెట్టారు.

ఇరు పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోల అభిమానులు అందరూ తమ తమ హీరోలు సందీప్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం, సందీప్ ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పై దృష్టి పెట్టారు.

  • Published Feb 03, 2024 | 2:33 PMUpdated Feb 03, 2024 | 2:33 PM
తన కెరీర్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులను వెల్లడించిన సందీప్ వంగా

ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సంచలనంగా మారారు. ఇరు పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోల అభిమానులు అందరూ తమ తమ హీరోలు సందీప్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం, సందీప్ ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పై దృష్టి పెట్టారు. కాగా ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. అలాగే ఏకకాలంలో యానిమల్ పార్క్ స్క్రిప్ట్‌ పై కూడా పని చేస్తున్నారు సందీప్ వంగా, ఈ క్రేజీ సీక్వెల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

ఇది కాకుండా, సందీప్ వంగా అల్లు అర్జున్‌తో ఒక చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.. అయితే ఆ సినిమా సెట్స్ పైకి రావటానికి చాలా సమయం పడుతుంది. ముందుగా స్పిరిట్ మరియు యానిమల్ పార్క్ తర్వాతనే అల్లు అర్జున్ – వంగాల సినిమా ప్రారంభమవుతుంది.

ఇటీవలి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కు ప్రధానమైన ముగ్గురు స్ఫూర్తిదాయకమైన సినీ ప్రముఖులుగా చిరంజీవి, ఇళయరాజా మరియు ఏఆర్ రహమాన్ ల పేర్లను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రభావం గురించి సందీప్ వంగా ఇది వరకే చాలాసార్లు మాట్లాడారు. కాగా ఈ యువ దర్శకుడు ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవిని వ్యక్తిగతంగా కూడా కలిశారు మరియు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరియు సమీప భవిష్యత్తులో ఈ కాంబో వర్క్ అవుట్ కావాలని మెగా అభిమానులు ఎంతో ఆశతో కోరుకుంటున్నారు. చిరంజీవి – సందీప్ వంగా ల కాంబినేషన్ లో సినిమా గనక వస్తే ఖచ్చితంగా ఆ సినిమా ఒక సంచలనం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక పోతే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయింది. కాగా థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన తర్వాత ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు మొదటి వారంలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా మారింది మరియు నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి