iDreamPost

హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య

హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య

హైదరాబాద్ సీపీగా ఉన్న సీపీ ఆనంద్ పై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే నూతన సీపీగా సందీప్ శాండిల్య నియామకమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పేరును సిఫార్సు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, శనివారం సందీప్ శాండిల్య హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

మొత్తంగా 20 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే.. సందీప్ శాండిల్య ప్రస్తుతం పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఏదేమైనా రేపు హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే అధికారులపై బదిలీ వేటు పడిందని కొందరు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి