iDreamPost

Duniya Vijay : బాలయ్య సినిమా కోసం శాండల్ వుడ్ స్టార్

Duniya Vijay : బాలయ్య సినిమా కోసం శాండల్ వుడ్ స్టార్

కన్నడలో మంచి ఇమేజ్ ఉన్న హీరోలు తెలుగులో విలన్లుగా చేయడం ఈనాటి ముచ్చట కాదు. ఎప్పుడో 80 దశకంలోనే కన్నడ ప్రభాకర్ బోలెడు సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించారు. అందులో అధిక శాతం చిరంజీవివే. దేవరాజ్ అంటే మనకు ఠక్కున సమరసింహారెడ్డి, ఎర్రమందారంలు గుర్తొస్తాయి. అంతగా ప్రభావం చూపించిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన. సుదీప్ గురించి చెప్పేదేముంది.రాజమౌళి అడగ్గానే తన ఇమేజ్ పక్కనపెట్టి మరీ ఈగ చేతిలో చచ్చిపోయే క్యారెక్టర్ లో జీవించేశారు. ఇలా చెప్పుకోదగ్గ ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వీళ్లంతా ఇక్కడ చేయడానికి కారణం తెలుగు మార్కెట్ పెద్దది కావడమే.

ఇదిలా ఉండగా తాజాగా మరో శాండల్ వుడ్ స్టార్ ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అతని పేరు దునియా విజయ్. మనిషి కారు నలుపే కానీ కర్ణాటకలో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే కోటిగొబ్బ 3తో పోటీ పడిన విజయ్ సలగ ఘన విజయం సాధించింది. దునియా బ్లాక్ బస్టర్ తో దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న విజయ్ ది విలన్ కి సరిపోయే రూపం. అందుకే బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా కోసం ఇతన్ని సంప్రదించినట్టుగా తెలిసింది. పాత్ర నచ్చి అతనూ చేయడానికి ఒప్పుకున్నట్టుగా ఫిలిం నగర్ న్యూస్.

అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని చెబుతున్నారు. శృతి హాసన్ ని హీరోయిన్ గా ప్రకటిస్తూ దీపావళికి ఆల్రెడీ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. బాలయ్య లాంటి సీనియర్ మోస్ట్ హీరోతో ఆవిడ చేయడం ఇదే మొదటిసారి. ఇటీవలే చిన్న సర్జరీ చేయించుకున్న బాలకృష్ణ రెస్ట్ పూర్తి కాగానే దీని రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజకు క్రాక్ రూపంలో ఈ 2021 తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని తమ హీరోని ఇంకే రేంజ్ లో చూపిస్తాడనే రేంజ్ లో ఫ్యాన్స్ అప్పుడే చాలా ఊహించేసుకుంటున్నారు

Also Read : Sai Dharam Tej -సాయి తేజ్ క్షేమం – మెగా ఫోటో సాక్ష్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి