iDreamPost

ప్రజల వద్దకే పాలనలో మరో ముందడుగు

ప్రజల వద్దకే  పాలనలో మరో ముందడుగు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో సాకారం చేసే దిశ వైసీపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు నిత్యం ప్రజలకు సరళతరమైన సేవలు ఎలా అందించాలన్న అంశంపైనే సాగుతున్నట్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో ఓ వినూత్న విధానం ద్వారా గ్రామ స్వరాజ్యానికి నాంధి పలికిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ సేవను అక్కడ నుంచే అందించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

దాదాపు 535 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తుండగా.. అందులో మరిన్ని సేవలు అందించేందుకు వైసీపీ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు కూడా గ్రామ సచివాలయాల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్థారించగా.. తాజాగా ఇసుక విక్రయాలు కూడా గ్రామ సచివాలయాల ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.

ఇసుక కావాల్సిన వారు.. తమ పరిధిలోని గ్రామ సచివాలయంలో బుక్‌ చేసుకుంటే నేరుగా వారి ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రజలకు వేగంగా. సులువుగా ఇసుకను అందజేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దాంతోపాటు ఇసుక ఆన్‌లైన్‌ అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చని యోచిస్తోంది. ప్రతి రెండు వేల కుటుంబాలకు ఒక సచివాలయం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇసుక బుకింగ్, ఇతర సేవలు వేగంగా అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి