iDreamPost

Samrat Prithviraj సామ్రాట్ పృథ్విరాజ్ రిపోర్ట్

Samrat Prithviraj సామ్రాట్ పృథ్విరాజ్ రిపోర్ట్

నిన్న తెలుగు ప్రేక్షకులు మేజర్, విక్రమ్ ల హడావిడిలో పడిపోయారు కానీ మరో ప్యాన్ ఇండియా మూవీ సామ్రాట్ పృథ్విరాజ్ కూడా థియేటర్లలో రిలీజయ్యింది. యష్ సంస్థ సినిమా కావడంతో స్క్రీన్లు బాగానే దొరికాయి కానీ ముందు నుంచి దీని మీద చెప్పుకోదగ్గ బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం 10 కోట్ల నెట్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది బచ్చన్ పాండే కంటే తక్కువ. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో, భారీ బడ్జెట్ తో కూడిన గ్రాండియర్ ఇవేవీ జనాన్ని హాలు దాకా రప్పించలేకపోతున్నాయి. అసలు ఇందులో కంటెంట్ ఏముందో రిపోర్ట్ లో చూద్దాం

సామ్రాట్ పృథ్విరాజ్(అక్షయ్ కుమార్) కు ఢిల్లీ సింహాసనం సొంతం చేసుకోవడమే లక్ష్యం. దీనికోసం ఎంత పోరాటానికైనా సిద్ధపడతాడు. మహమ్మద్ ఘోరీ(మానవ్ విజ్) ఇదే ఉద్దేశంతో ప్రయత్నిస్తూ పృథ్విరాజ్ తో జరిగిన యుద్ధంలో ఓటమి పాలవుతాడు. పక్కనే ఉంటూ కుట్రలు చేసే జైచంద్(అశుతోష్ రానా)తో సామ్రాట్ కు ఇబ్బందులు ఎదురవుతాయి. పృథ్విరాజ్ నే పెళ్లి చేసుకోవాలనే శపథం చేసిన సంయోగిత(మానుషీ చిల్లర్)ను అతను అంగీకరించాడా, తర్వాత ఢిల్లీ ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

దర్శకుడు చంద్రప్రకాష్ త్రివేది దీనికి మూలంగా చాంద్ బర్దే రాసిన కావ్యాన్ని తీసుకున్నారు కానీ అంతే ప్రతిభావంతంగా తెరకెక్కించలేకపోయారు. అన్ని అంశాలు ఉన్నట్టు అనిపించినా కథనం సరైన రీతిలో సాగకపోవడంతో ఎక్కువసేపు బోర్ కొడుతుంది. పైగా గొప్ప వీరుడి కథను చెప్పే క్రమంలో జరిగిన తడబాటు వల్ల చరిత్రకారులకు ఎన్నో తప్పులను ఎంచే అవకాశం ఇచ్చేశారు. గ్రాఫిక్స్ కూడా సబ్జెక్టు డిమాండ్ చేసిన స్థాయిలో లేవు. ఇలాంటి వార్ డ్రామాలు గతంలో చాలా చూసి ఉండటం వల్ల పృథ్విరాజ్ అతి సామాన్యంగా కనిపిస్తాడు. ఎన్నో ఏళ్ళ క్రితం వచ్చిన జోధా అక్బర్ లాంటి క్లాసిక్స్ కు దగ్గరగా కూడా వెళ్లలేకపోయాడు పృథ్విరాజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి