iDreamPost

మే 20 – బాక్సాఫీస్ పోటీ

మే 20 –  బాక్సాఫీస్ పోటీ

ఇంకో శుక్రవారానికి బాక్సాఫీస్ రెడీ అవుతోంది. 12న వచ్చిన సర్కారు వారి పాట దూసుకుపోతూ ఉండగా దానికి పోటీగా కేవలం వారం గ్యాప్ లో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటిది ‘శేఖర్’. జీవిత దర్శకత్వంలో మలయాళం హిట్ మూవీ జోసెఫ్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మొదటిసారి రాజశేఖర్ పూర్తిగా మాసిపోయిన తెల్లని గెడ్డం, జుట్టుతో నటించారు. ఒక యాక్సిడెంట్ కు సంబంధించిన మెడికల్ మాఫియా గుట్టు బయటికి తీసే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా హీరో పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ చేసింది స్టార్ హీరో కాదు కాబట్టి ఓటిటిలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎవరూ చూసుండరన్న గట్టి నమ్మకంతో టీమ్ ఉంది.

సంపూర్ణేష్ బాబు నటించిన ‘దగడ్ సాంబ’ కూడా 20నే వస్తోంది. దీని మీద అంచనాలు ఏ మాత్రం లేవు. ఏదో మాస్ సెంటర్స్ లో కాసేపు నవ్వించిందనే టాక్ వస్తే తప్ప కనీస వసూళ్లు రావు. నాగ శౌర్య కృష్ణ వృంద విహారి రావాల్సింది కానీ ఎందుకో వెనుకడుగు వేసింది. సత్యదేవ్ గాడ్సే ని సైడ్ చేశారు. దీంతో ఈ రెండింటి మధ్యే పోటీ తప్పలేదు. ఇక బాలీవుడ్ నుంచి కూడా రెండు రిలీజవుతున్నాయి. ‘భూల్ భూలయ్యా’ 2 మీద ఓ మాదిరి బజ్ ఉంది. చంద్రముఖి రీమేక్ గా అక్షయ్ కుమార్ చేసిన మొదటి భాగానికి ఇది సీక్వెల్. కాకపోతే వెంకటేష్ నాగవల్లిని రిఫరెన్స్ గా తీసుకోకుండా కొత్త కథ రాసుకున్నారు. ఓపెనింగ్స్ కోసం టికెట్ రేట్లు కూడా తగ్గించారు.

కంగనా రౌనత్ ‘దాకడ్’ ఓ మోస్తరు అంచనాలతో రంగంలోకి దిగుతోంది. తెలుగు రాష్ట్రాలలో వీటికి ఓపెనింగ్స్ ఆశించలేం కానీ టాక్ బాగుంటే నగరాల్లో జనం థియేటర్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా చూసుకున్నా ఇవేవి సర్కారు వారి పాట మీద ప్రభావం చూపించేవి కాదు. అసలు మహేష్ మూవీనే వీక్ డేస్ లో బాగా నెమ్మదించింది. మళ్ళీ వీకెండ్ కోసం ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. అలాంటిది 20న వచ్చే సినిమాల మీద అంతగా ఆశలు పెట్టుకోవడానికి ఏమి లేదు. 27న రిలీజయ్యే ఎఫ్3కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటిదాకా ఇవి ఫీడింగ్ కి మాత్రమే పనికొస్తాయి. చూడాలి మే 20న బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి