iDreamPost

Samantha: ఎట్టకేలకు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సమంత!

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ సమంత. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. మరి సామ్ చెప్పిన ఆ శుభవార్త ఏంటి?

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ సమంత. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. మరి సామ్ చెప్పిన ఆ శుభవార్త ఏంటి?

Samantha: ఎట్టకేలకు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సమంత!

సమంత.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అయితే గత కొంత కాలంగా ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతోంది సామ్. దాంతో సుమారు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలను అనారోగ్యంతో పూర్తి చేసి.. పనిపై తన నిబద్ధతను చాటుకుంది. చివరిగా శాకుంతలం, ఖుషీ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనైయ్యారు. అయితే తాజాగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది సామ్. ఈ మేరకు తన ఇన్ స్టాలో స్టోరీని పోస్ట్ చేసింది. మరి సమంత చెప్పిన ఆ శుభవార్త ఏంటో చూద్దాం.

అనారోగ్యంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది బ్యూటీ సమంత. హెల్త్ బాలేనప్పటికీ కూడా ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి.. అందరి చేత శభాష్ అనిపించుకుంది. శాకుంతలం, ఖుషీ మూవీలతో పాటుగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. ప్రస్తుతం సామ్ ఆరోగ్యం కుదుటపడ్డట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్లు స్వయంగా చెప్పుకొచ్చింది ఈ సోయగం. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది సమంత.

అందులో..”కొన్ని రోజులుగా చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు? అని. అయితే ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. త్వరలోనే నేను షూటింగ్ లో పాల్గొనబోతున్నాను. ఇన్ని రోజులు జాబ్ లెస్ గా ఉన్నా. ఇక నా ఫ్రెండ్స్ తో కలిసి ఆరోగ్య పాడ్ కాస్ట్ పై ఓ ప్రోగ్రాం చేశాం. త్వరలోనే దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చింది సామ్. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లీ మా అభిమాన తార త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు. మరి సమంత రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Deepika Padukone: ‘కల్కి 2898 AD’ కోసం దీపికకు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. కెరీర్​లో ఇదే హయ్యెస్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి