iDreamPost

Salaar: ‘సలార్’ ముందు భారీ టార్గెట్​లు.. ఇవి బ్రేక్ చేస్తే ప్రభాస్​కు తిరుగుండదు!

  • Published Dec 21, 2023 | 12:56 PMUpdated Dec 21, 2023 | 3:25 PM

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్టే అవేటెడ్ మూవీ ‘సలార్’ ముందు భారీ టార్గెట్​లు ఉన్నాయి. ఒకవేళ వీటిని బ్రేక్ చేస్తే మాత్రం ప్రభాస్​కు తిరుగుండదు.

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్టే అవేటెడ్ మూవీ ‘సలార్’ ముందు భారీ టార్గెట్​లు ఉన్నాయి. ఒకవేళ వీటిని బ్రేక్ చేస్తే మాత్రం ప్రభాస్​కు తిరుగుండదు.

  • Published Dec 21, 2023 | 12:56 PMUpdated Dec 21, 2023 | 3:25 PM
Salaar: ‘సలార్’ ముందు భారీ టార్గెట్​లు.. ఇవి బ్రేక్ చేస్తే ప్రభాస్​కు తిరుగుండదు!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ గోయర్స్​ను ఎంతగానో ఊరిస్తూ వస్తున్న ‘సలార్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో బిగ్​స్క్రీన్స్​లో డైనోసార్ హంగామా మొదలుకానుంది. ప్రభాస్ కొత్త చిత్రం విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. దీంతో టికెట్ల కోసం భారీగా ఎగబడుతున్నారు ఫ్యాన్స్. బుక్​ మై షోలో టికెట్ సేల్స్ స్టార్ట్ కాగానే ప్రభాస్ అభిమానుల దెబ్బకు ఆ యాప్ సర్వర్ క్రాష్ అయింది. కొన్ని చోట్ల థియేటర్ల దగ్గర నేరుగా టికెట్స్ అమ్ముతుండటంతో అక్కడికి పరుగులు తీస్తున్నారు ఫ్యాన్స్. బిగ్​స్క్రీన్స్​ వద్ద అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ని అడ్వాన్స్ బుకింగ్స్​లో తొక్కిపడేస్తూ దూసుకెళ్తోంది ‘సలార్’. అయితే ప్రభాస్​ ఈ ఫిల్మ్​తో భారీ లక్ష్యాలను అందుకోవాల్సి ఉంది. ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్న ఈ మూవీ రీచ్ అవ్వాల్సిన టార్గెట్లు కూడా అదే రేంజ్​లో ఉన్నాయి.

‘సలార్​’కు ఒక రేంజ్​లో బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో ‘బాహుబలి’ని మించి రేట్లు పలికడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కొత్త సినిమాకు రూ.350 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆ లెక్కన ప్రతి ఏరియాలోనూ ‘సలార్’కు భారీగా టార్గెట్లు సెట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ హైప్, బజ్ భారీగానే ఉన్నప్పటికీ.. మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఒక వారం పాటు పెర్ఫార్మ్ చేస్తే తప్ప ఆ టార్గెట్లను అందుకోవడం అంత ఈజీ కాదు. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.65 కోట్ల బిజినెస్ చేసిందట ‘సలార్’. ఆ లెక్కన తెలంగాణ వరకే గ్రాస్ కలెక్షన్స్ రూ.100 కోట్లు దాటాలి. ఆంధ్రా ఏరియాలోనూ నైజాంకు దీటుగా బిజినెస్ జరిగింది. అక్కడ రూ.62 కోట్లకు రైట్స్ అమ్మారట. సీడెడ్ హక్కుల ద్వారా మరో రూ.24 కోట్లు తెచ్చిపెట్టాయట. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే ‘సలార్’ రూ.150 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.

salar movie targets

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ హిట్ స్టేటస్ తీసుకోవాలంటే రూ.250 కోట్ల మేర గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. సౌతిండియాలోని మిగిలిన రాష్ట్రాల్లో రూ.50 కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్. ప్రభాస్ కొత్త మూవీ హిందీ వెర్షన్​ రైట్స్ రూ.75 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ మరో రూ.75 కోట్లు పలికాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఫిల్మ్ థియేట్రికల్ బిజినెస్‌ రూ.350 కోట్లు అని సమాచారం. ఇంత బిగ్ టార్గెట్​ను రీచ్ అవ్వాలంటే ‘సలార్’ ఫుల్ రన్​లో రూ.600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్​ను రాబట్టాల్సి ఉంటుంది. మూవీ మీద ఉన్న హైప్ దృష్ట్యా ఇదేమంత కష్టం కాదు. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి. మంచి మౌత్ టాక్ వచ్చి రిపీటెడ్ ఆడియెన్స్​ కూడా వస్తే ‘సలార్’ టార్గెట్​ను మించిన వసూళ్లు సాధిస్తుంది. ఒకవేళ ఈ లక్ష్యాలు అన్నింటినీ రీచ్ అయితే మాత్రం ప్రభాస్​కు తిరుగుండదు. ఆయన సత్తా ఏంటో మరోమారు ప్రూవ్ అవుతుంది. మరి.. ‘సలార్’ అన్ని టార్గెట్స్​ను అందుకుంటుందని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Dunki Movie Review In Telugu: డంకీ మూవీ రివ్యూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి