iDreamPost

Salaar Vs Dunki: సలార్ vs డంకీ! ప్రభాస్, షారూఖ్ ఇద్దరిలో ఎవరు గెలిచారంటే?

  • Published Dec 22, 2023 | 11:48 AMUpdated Dec 22, 2023 | 11:48 AM

ఇయర్ ఎండ్ లో సినిమా అభిమానులకు పండగ లాంటి సర్ప్రైజ్ ఇచ్చారు ప్రభాస్, షారుక్ ఖాన్. ఒక్క రోజు తేడాతో వీరిద్దరూ నటించిన డంకీ, సలార్ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. మరి ప్రభాస్, షారూఖ్ ఇద్దరిలో ఎవరు గెలిచారంటే..

ఇయర్ ఎండ్ లో సినిమా అభిమానులకు పండగ లాంటి సర్ప్రైజ్ ఇచ్చారు ప్రభాస్, షారుక్ ఖాన్. ఒక్క రోజు తేడాతో వీరిద్దరూ నటించిన డంకీ, సలార్ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. మరి ప్రభాస్, షారూఖ్ ఇద్దరిలో ఎవరు గెలిచారంటే..

  • Published Dec 22, 2023 | 11:48 AMUpdated Dec 22, 2023 | 11:48 AM
Salaar Vs Dunki: సలార్ vs డంకీ! ప్రభాస్, షారూఖ్ ఇద్దరిలో ఎవరు గెలిచారంటే?

ఒక్క పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది రెండు పాన్ ఇండియా సినిమాలు 24 గంటల తేడాతో ప్రేక్షకులు మందుకు వస్తే.. ఇంక ఫ్యాన్స్ సంతోషం గురించి చెప్పాల్సిన పని లేదు. డార్లింగ్ ప్రభాస్, షారుఖ్ ఖాన్ వంటి ఇద్దరు సూపర్ స్టార్ లు నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు సలార్, డంకీ ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాల మీద భారీ అంచనాలతో పాటు.. పెద్ద ఎత్తున బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. పైగా విడుదలకు ముందు నుంచే.. సలార్, డంకీల మధ్య పోటీ వాతావరణం కనిపించింది.

ఉత్తరాదిలో సలార్ సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కానీ అవేవి ప్రభాస్ క్రేజ్ ను ఆపలేకపోయాయని ప్రీబుకింగ్స్ చూస్తే అర్థం అవుతోంది. ఇక డంకీ టీమ్ బీభత్సంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసి సినిమాని విడుదల చేస్తే.. సలార్ టీమ్ మాత్రం.. ఎలాంటి హడావుడి లేకుండా థియేట్లరలోకి వచ్చి థౌజెండ్ వాలా రేంజ్లో మోత మోగించింది. మరి ఒక్క రోజు తేడాతో థియేటర్లలలోకి వచ్చిన ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ హిట్ అయ్యింది.. బాక్సాఫీస్ రేసులో ఎవరు విజయం సాధించారంటే..

dunki sharukh khan

డంకీ సినిమా..

రాజ్‌కుమారీ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం డంకీ. ‘సలార్’ కంటే ఒకరోజు ముందే అనగా డిసెంబర్ 21, గురువారం నాడు ‘డంకీ’ విడుదల అయ్యింది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుందనే టాక్ వచ్చింది. దాంతో ఆశించిన మేర కలెక్షన్లు రాబట్టలేకపోయింది. డంకీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు.. నెట్ కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే.. 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్ల (రూ.140 కోట్లు) కన్నా ఇది చాలా తక్కువ. దాంతో రాజ్ కుమార్ హిరానీ కెరీర్లోనే వీకెస్ట్ మూవీగా డంకీ పేరు తెచ్చుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.7.51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.

సలార్ సినిమా..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న అనగా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సలార్ సినిమాలో ప్రభాస్ ఊర మాస్ యాక్షన్ తో వెండి తెర మీద ఊచకోత కోశాడంటున్నారు ఫ్యాన్స్. ఆరేళ్ల అభిమానుల ఆకలిని సలార్ సినిమాతో తీర్చేశాడు రెబల్ స్టార్. ఫస్ట్ డే కలెక్షన్లలో సలార్.. డంకీని వెనక్కి నెట్టుస్తుందని.. సినీ ట్రేడ్ వర్గాలు అంచాన వేస్తున్నాయి.

salaar

అయితే సలార్ ప్రీ రిలీజ్ కలెక్షన్లు డంకీ కన్నా కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకు కారణం.. నార్త్ లో సలార్ కు సరిపడా థియేటర్లు కేటాయించలేదు. దాంతో ప్రీ రిలీజ్ బుకింగ్స్ లో కాస్త వెనకబడ్డ.. ఫస్డ్ డే కలెక్షన్లతో డంకీని వెనక్కి నెడతాడని నమ్మకంగా చెబుతున్నారు. సలార్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాడని సినీ ట్రేడ్ వర్గాలు అంచాన వేస్తున్నాయి.

సలార్ ముందు తేలిపోయిన డంకీ..

ఇక నార్త్ ఇండియాలో సైతం సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక ఫస్ట్ డే నాడు డంకీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడం.. సలార్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండటంతో.. ప్రభాస్ ప్రభంజనం ముందు షారుక్ తేలిపోతాడంటున్నారు. ముందు రెండు సినిమాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని భావించారు. కానీ ఫస్డ్ డే టాక్ తో ఆ సీన్ కంప్లీట్ గా మారిపోయింది. డంకీ సినిమాకు ఉత్తరాదిన మెరుగైన స్పందన ఉంది కానీ.. సౌత్ ఇండియాలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పూర్ గా ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు.

అదే సలార్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా సూపర్ క్రేజ్ కనిపిస్తోంది. దానికి తోడు సలార్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇక దక్షిణాదిలో డంకీ సినిమాను పూర్తిగా ఎత్తివేయాల్సిన పరిస్థితి అంటున్నారు. ఓపెనింగ్స్ విషయంలో సలార్ ముందు డంకీ ఏ మాత్రం నిలబడేలా లేదు. అందులో మూడో వంతు వసూళ్లు వచ్చినా గొప్పే అంటున్నారు. సలార్ వర్సెస్ డంకీ పోటీలో డైనోసరే విజేతగా నిలిచింది.. డంకీ ఎక్కడో ఆగిపోయింది. ప్రభాస్ క్రేజ్ ముందు ఎంతటి సూపర్ స్టార్ అయినా ఓడిపోవాల్సిందే అని మరోసారి రుజువయ్యింది అంటున్నారు. మరి సలార్, డంకీ రెండు సినిమాల్లో మీకు ఏ మూవీ నచ్చింది.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి