iDreamPost

Salaar: ‘సలార్’కు మహాభారతం కనెక్షన్.. ఒకటీ, రెండూ కాదు.. చాలా సీన్స్!

  • Published Dec 21, 2023 | 5:10 PMUpdated Dec 21, 2023 | 5:10 PM

‘సలార్‌’ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచే విధంగా మేకర్స్, చిత్రంలో నటించిన యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మూవీలో కీలకమైన పాత్రలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు టినూ ఆనంద్ మాట్లాడుతూ ప్రభాస్ కొత్త ఫిల్మ్​పై ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. 

‘సలార్‌’ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచే విధంగా మేకర్స్, చిత్రంలో నటించిన యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మూవీలో కీలకమైన పాత్రలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు టినూ ఆనంద్ మాట్లాడుతూ ప్రభాస్ కొత్త ఫిల్మ్​పై ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. 

  • Published Dec 21, 2023 | 5:10 PMUpdated Dec 21, 2023 | 5:10 PM
Salaar: ‘సలార్’కు మహాభారతం కనెక్షన్.. ఒకటీ, రెండూ కాదు.. చాలా సీన్స్!

క్రిస్మస్‌ కానుకగా ఇండియన్‌ బాక్సాఫీస్​ను షేక్ చేసేందుకు రాబోతున్న ‘సలార్‌’ గురించిన విషయాలు ఒక్కొక్కటిగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన గ్లిమ్స్‌, టీజర్, రెండు ట్రైలర్​లు సినిమా స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా నిలిపాయని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ అంతకు మించిన సినిమా తీస్తాడని ప్రతి ఒక్కరూ పెట్టుకున్న నమ్మకం నిలిపే విధంగా ‘సలార్’ సినిమా ఉండబోతుంది అంటూ తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. మూవీ గురించి యూనిట్‌ సభ్యులు ఆహా.. ఓహో అన్నట్లుగా వ్యాఖ్యలు చేయకుండా సింపుల్​గా మాట్లాడుతూనే సినిమా స్థాయిని పెంచేస్తున్నారు. ‘సలార్‌’ గురించి హడావుడి ప్రచారాలు చేయడం లేదు. అయినా కూడా రోజురోజుకూ సినిమాకు హైప్‌ పెరుగుతూనే ఉంది. భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

‘సలార్‌’ స్థాయిని మరింతగా పెంచే విధంగా మూవీలో యాక్ట్ చేసిన సీనియర్ నటుడు టినూ ఆనంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ ఫ్యాన్స్​తో పాటు కొందరు నెటిజన్స్ టినూ ఆనంద్‌ ఇంటర్వ్యూలోని పలు అంశాలకు చెందిన వీడియో బైట్స్​ను షేర్‌ చేస్తున్నారు. ప్రభాస్ మంచితనం, ‘సలార్‌’ ఫిల్మ్ ఏ స్థాయిలో ఉండబోతోంది ఇలా అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో ‘సలార్’లో చాలా చోట్ల మహాభారతం తాలూకు సన్నివేశాలు మీరు చూడొచ్చు అన్నట్లుగా హింట్ ఇచ్చారు. మహాభారతంలో ఎన్నో గొప్ప కథలు, సన్నివేశాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అలాంటి మహాభారతం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది ఇన్​స్పైర్ అయి సీన్స్, మూవీస్ తీశారు. ‘సలార్‌’లో కూడా మహాభారతం ఇన్​పుట్స్ ఉన్నాయని.. కచ్చితంగా ఓ రేంజ్​లో సినిమా ఉంటుందని టినూ ఆనంద్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్‌ ‘కేజీఎఫ్’ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్స్​తో పాటు అద్భుతమైన స్క్రీన్‌ ప్లే ఇంకా మంచి కథను చూపించారు. ఇప్పుడు ‘సలార్‌’లో కథను కొత్తగా చూపించడంతో పాటు స్క్రీన్‌ ప్లే విషయంలో ‘కేజీఎఫ్’కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట. ఇక యాక్షన్‌ సన్నివేశాల విషయంలో ఇండియన్‌ మూవీ ఆడియెన్స్ మునుపెన్నడూ చూడని యాక్షన్​ను చూడబోతున్నారట. ప్రభాస్‌ పాత్ర ఎలివేషన్స్​కు కచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ‘డంకీ’ సినిమా పోటీగా విడుదలవుతున్నా కూడా ‘సలార్‌’ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. సౌత్​తో పాటు నార్త్​లో కూడా మంచి ఓపెనింగ్స్​ను రాబట్టగలిగితే వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల వసూళ్లు ‘సలార్‌’కు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాక్సాఫీస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. మరి.. ‘సలార్​’కు మహాభారతం కనెక్షన్ ఉండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కొత్త సినిమా రిలీజ్​లు.. శుక్రవారం సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి