iDreamPost

Salaar: RRR రికార్డులపై కన్నేసిన ‘సలార్’.. ఈసారి ప్రభాస్ కొట్టేలాగే ఉన్నాడు!

  • Author singhj Published - 08:53 AM, Wed - 13 December 23

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ రిలీజ్​కు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ రిలీజ్​కు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది.

  • Author singhj Published - 08:53 AM, Wed - 13 December 23
Salaar: RRR రికార్డులపై కన్నేసిన ‘సలార్’.. ఈసారి ప్రభాస్ కొట్టేలాగే ఉన్నాడు!

ఈ రోజుల్లో సినిమాల మీద బజ్ పెంచడం అనేది కష్టంగా మారింది. ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. మూవీ మేకింగ్ ఒక లెక్కయితే ప్రేక్షకుల్లో దాని మీద ఆసక్తిని పెంచడం మరొక ఎత్తనే చెప్పాలి. హీరో, హీరోయిన్ లుక్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్​తో వారిలో ఇంట్రెస్ట్​ను పెంచుతున్నారు. అలాగే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్​తో సినిమాలోని విశేషాల గురించి గొప్పగా చెబుతున్నారు. అయితే చాలా మటుకు మూవీస్​కు టీజర్, ట్రైలర్​లో ఉన్న కంటెంట్.. థియేటర్​లో సినిమాకు పోలిక ఉండట్లేదు. రిలీజ్​కు ముందు విజువల్స్​తో హైప్ పెంచడం, మాటలతో జోష్ తీసుకొచ్చినా.. తీరా థియేటర్​లో బొమ్మ సరిగ్గా ఉండకపోవడం నెగెటివ్​గా మారుతోంది. అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి కొందరు దీనికి మినహాయింపు అనే చెప్పాలి.

జక్కన్న, నీల్ మామ వంటి మేకర్స్ రిలీజ్​కు ముందు చెప్పిన కంటెంట్ కంటే మూవీస్​లో మరింత క్వాలిటీ కంటెంట్​ను చూపిస్తూ ఆడియెన్స్ మనసులు దోచుకుంటున్నారు. దీంతో వారి సినిమాలకు రూ.వందల కోట్ల వసూళ్లు వచ్చి పడుతున్నాయి. అయితే రాజమౌళి తన మూవీస్​ ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం టీజర్, ట్రైలర్స్​తోనే హైప్ పెంచేస్తారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా పొడిపొడిగానే మాట్లాడతారు. బహుశా కంటెంట్ మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన అలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాను తీస్తున్న కొత్త చిత్రం ‘సలార్’ విషయంలోనూ ఆయన ఎక్కువ హడావుడి చేయడం లేదు. కానీ ఈ ఫిల్మ్ నుంచి బయటకు వస్తున్న కంటెంట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

‘సలార్’ ప్రచార చిత్రాలకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ లభించింది. పెద్దగా ప్రచారం చేయకున్నా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ మీద బజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అందుకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ఒక కారణమైతే.. ప్రభాస్-ప్రశాంత్ కాంబో మరో రీజన్ అని చెప్పొచ్చు. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ‘సలార్’ పార్ట్-1 కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ టిక్కెట్ రేట్స్ మాత్రం సగటు ప్రేక్షకుడ్ని కాస్త భయపెడుతున్నాయి. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం కాబట్టి ‘సలార్​’ను టిక్కెట్ రేట్లు పెంచుకొని రిలీజ్ చేసేలా పర్మిషన్ ఇవ్వాలని ప్రొడ్యూసర్స్ ప్రభుత్వాన్ని కోరారని తెలుస్తోంది.

నైజాం ఏరియాలో మల్టీప్లెక్సుల్లో రూ.350 (అదనంగా ట్యాక్స్), సింగిల్ స్క్రీన్స్​లో రూ.200 (అదనంగా ట్యాక్స్) టికెట్ ధరలు ఉండేలా తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరారని సమాచారం. రెండో వారంలో సినిమా టికెట్ రేట్లు మల్టీప్లెక్సుల్లో రూ.300 (అదనంగా ట్యాక్స్), సింగిల్ స్క్రీన్స్​లో 177.5 (అదనంగా ట్యాక్స్) ఉండేలా అనుమతి ఇవ్వాలని అడిగారని టాక్. ఒకవేళ పర్మిషన్ లభిస్తే మాత్రం ‘సలార్’ ఓపెనింగ్స్​ అదిరిపోయే అవకాశం ఉంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే రికార్డులకు మూడినట్లే కనిపిస్తోంది. టాక్​తో సంబంధం లేకుండా తొలి రోజు వసూళ్లలో రికార్డు సృష్టించడం ఖాయంలా కనిపిస్తోంది. ఒకవేళ పాజిటివ్ రివ్యూలు పడి, మౌత్ టాక్ బాగుంటే ‘ఆర్ఆర్ఆర్’ క్రియేట్ చేసిన మిగిలిన కొన్ని రికార్డులను కూడా డైనోసార్ అధిగమించడం కన్ఫర్మ్‌ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను ‘సలార్’ బ్రేక్ చేస్తుందనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గుంటూరు కారంకు శ్రీలీల టెన్షన్! ఆందోళనలో మహేశ్ ఫ్యాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి