iDreamPost

TDPకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమే: సజ్జల రామకృష్ణా రెడ్డి

  • Author singhj Published - 04:18 PM, Thu - 24 August 23
  • Author singhj Published - 04:18 PM, Thu - 24 August 23
TDPకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమే: సజ్జల రామకృష్ణా రెడ్డి

తెలుగుదేశం పార్టీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వెఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మరోమారు విమర్శలకు దిగారు. ఓట్ల తొలగింపు విషయంలో టీడీపీది తప్పుడు ప్రచారం అని ఆయన అన్నారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందని సజ్జల మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందేనన్నారు సజ్జల. ఆ పార్టీ గతంలో చేసిన తప్పులను తాము సరిచేశామన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలో టీడీపీ అక్రమాలు చేసిందన్నారు సజ్జల.

తెలుగుదేశం పార్టీ చేసిన అక్రమాల మీద గతంలో తాము పోరాడామని సజ్జల గుర్తుచేశారు. వైసీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీకి అడ్డదారులు తొక్కడమే తెలుసునని విమర్శించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టక్కుటమార విద్యల్లో పీహెచ్​డీ చేశారని సజ్జల చెప్పారు. చంద్రబాబు తన విద్యలను అఖిల భారత స్థాయిలోనూ ప్రదర్శించారని.. గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటేనని సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పార్టీ గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను తాము చేర్పించామన్నారు.

‘ఇంకా కొన్ని లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ గనుక తొలగిస్తే ప్రజా తీర్పు కచ్చితంగా వస్తుందని మా నమ్మకం. కుప్పం నియోజకవర్గంలో కూడా 30 వేల దొంగ ఓట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుంది. టీడీపీ అన్యాయంగా తీసేసిన ఓట్లను మేం చేర్పించుకుంటాం. ఉరవకొండలో ఓట్ల తొలగింపు సరిగా లేనందునే అధికారులను సస్పెండ్ చేశారు. అంతేగానీ అక్కడి ఓట్లు తొలగించారని కాదు. ప్రభుత్వ డేటాను బ్లూఫ్రాగ్ అనే సంస్థకు ఇచ్చారు. అలాగే ఐటీ గ్రిడ్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. సేవామిత్ర అనే యాప్​ను దీనికి జోడించి ఓట్లను తీసేశారు’ అని సజ్జల సీరియస్ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి