iDreamPost

టీడీపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

టీడీపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు వైసీపీ నేతలు కూడా ధీటుగానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని సజ్జల ప్రశ్నించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. అన్ని ఆధారలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేసింది. ఫేక్‌ ఇన్వాయిస్‌తో చంద్రబాబు నిధులు పక్కదారి పట్టించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్‌ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్‌ సంస్థ సైతం మాకు సంబంధం లేదని చెప్పిందని గుర్తు చేశారు. రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 300 కోట్లు జేబులో వేసుకోవడానికే స్కిల్‌ కుట్ర. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉంది. న్యాయస్థానం కూడా నమ్మే చంద్రబాబును జైలుకు పంపించింది. ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణ కొచ్చారు” అని సజ్జల తెలిపారు.

ఇక ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షురాలు పురందేశ్వరిపై కూడా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ చీఫ్‌గా కాకుండా, ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని సజ్జల అన్నారు. లోకేష్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడో అర్థం కావడం లేదని, అన్ని వ్యవస్థలను మోసం చేశారని ఆయన తెలిపారు. తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలు మోహం చాటేస్తున్నారని సొంతపార్టీ నేతలే టీడీపీని పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ఎన్ని జాకీలు పెట్టి లేపిన టీడీపీ పార్టీ లేవదని సజ్జల పేర్కొన్నారు. మరి.. సజ్జల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి