iDreamPost

OTTలోకి వెంకీ సైంధవ్‌ మూవీ? ఇంత తొందరగా వస్తాదని ఎవ్వరూ అనుకోలేదు!

  • Published Jan 22, 2024 | 7:51 PMUpdated Jan 22, 2024 | 7:51 PM

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలు.. ఆయా కథలను బట్టి అటు ఇటుగా మంచి టాక్ నే సంపాదించుకున్నాయి. ఇక థియేటర్ లలో ఈ సినిమాలను మిస్ అయిన వారు.. అవి ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ నటించిన సైంధవ్‌ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలు.. ఆయా కథలను బట్టి అటు ఇటుగా మంచి టాక్ నే సంపాదించుకున్నాయి. ఇక థియేటర్ లలో ఈ సినిమాలను మిస్ అయిన వారు.. అవి ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ నటించిన సైంధవ్‌ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Published Jan 22, 2024 | 7:51 PMUpdated Jan 22, 2024 | 7:51 PM
OTTలోకి వెంకీ సైంధవ్‌ మూవీ? ఇంత తొందరగా వస్తాదని ఎవ్వరూ అనుకోలేదు!

థియేటర్ లో విడుదల అయిన ఏ చిత్రం అయినా ఓటీటీలోకి రావాల్సిందే. అంతలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇటీవల సూపర్ హిట్ సాధించిన చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తూ.. భారీగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇంకా థియేటర్ లో విడుదల అవ్వని చిత్రాలను కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ముందుగానే కొనుగోలు చేసుకుంటున్నాయి. అలాగే వెంకటేష్ నటించిన సైంధవ్‌ చిత్రానికి ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయని ఆల్రెడీ విన్నాము. ఇప్పుడు అనుకున్న దానికంటే ముందే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుందనే వార్త వినిపిస్తోంది. సైంధవ్‌ జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఊహించిన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో.. ఈ చిత్రం యావరేజ్‌ కలెక్షన్లతో సరిపెట్టుకుంది.

వెంకటేష్ నటించిన 75వ చిత్రంగా.. సైంధవ్‌ విడుదలకు ముందు బాగా హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్‌- శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో,హీరోయిన్లుగా నటించారు. కాగా యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా, మరికొంతమంది ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నటించిన నటీ నటులంతా తమ వంతు నటనకు వంద శాతం న్యాయం చేశారు. ఇక విక్టరీ వెంకటేష్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ యాక్షన్ తో వెంకటేష్ చాలా బాగా కనబరిచారు. తండ్రి కూతుళ్ళ మధ్య సాగిన కథలో.. కూతురి ప్రాణాలను దక్కించుకోవడం కోసం.. కార్టెల్ అనే మాఫియా గ్యాంగ్‌తో సైంధవ్ ఎలాంటి పోరాటం సాగించాడన్నదే స్టోరీ. కానీ, ఇది ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కాబట్టి సైంధవ్‌ చిత్రం యావరేజ్ టాక్ ను సంపాదించుకుందని చెప్పి తీరాలి. ఇక కలెక్షన్స్ కూడా అంతగా రాబట్టలేదనే టాక్ వినిపిస్తోంది. దీనితో థియేటర్ లలో ఈ సినిమా అంతగా మెప్పించలేకపోవడంతో..మేకర్స్ ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

saindav movie in ott

కాగా సైంధవ్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఫిబ్రవరి నెల ఆఖరుకు ఓటీటీలో సైంధవ్‌ రిలీజ్ చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లలో అంతగా రెస్పాన్స్‌ రాకపోవడంతో.. అనుకున్న దానికంటే ముందుగానే సైంధవ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం చూసినట్లయితే .. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీల్లో సైంధవ్‌ ను ఓటీటీలో విడుదల చేయనున్నారట. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, త్వరలోనే ప్రకటించనున్నారట. అంతేకాకుండ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మలయాళ భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమింగ్‌ కానుంది. ఇక , ఓటీటీలో ఈ చిత్రం ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, సైంధవ్‌ ఓటీటీ స్ట్రీమింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి