iDreamPost

వీడియో: చెల్లి నిశ్చితార్థంలో సాయిపల్లవి మాస్ డ్యాన్స్! అదరగొట్టేసింది!

Sai Pallavi Dance at Sister Engagement: తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె తన సహజ నటనతోనే కాదు.. అదిరిపోయే డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచింది.

Sai Pallavi Dance at Sister Engagement: తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె తన సహజ నటనతోనే కాదు.. అదిరిపోయే డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచింది.

వీడియో: చెల్లి నిశ్చితార్థంలో సాయిపల్లవి మాస్ డ్యాన్స్! అదరగొట్టేసింది!

టాలీవుడ్ లోకి మాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో చాలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే రాణించగలిగారు.  దక్షిణాది స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. నటించిన సినిమాలు తక్కువే అయినా సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది.. అందుకే ఆమెను సహజనటి అంటారు. నటన మాత్రమే కాదు..  అదిరిపోయే స్టెప్పులతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. సాయి పల్లవి సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా దూసుకెళ్తుంది. తాజాగా సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఈ సందర్భంగా ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన సహజ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది. ఆ క్రేజ్‌తోనే ఆమెకు లేడీ పవర్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు ప్రేక్షకులు. అంతేకాదు సాయి పల్లవిని డ్యాన్స్ క్వీన్ అంటారు. తాజాగా సాయి పల్లవి మాస్ డ్యాన్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి షురు అయ్యింది. సాయి పల్లవికి పూజ కన్నన్ ఒక చెల్లెలు ఉంది.. అచ్చం ఆమె పోలికలతోనే ఉంటుంది. పూజ కన్నన్ కోలీవుడ్ ‘చిత్తిరై సెవ్వనం’ మూవీలో నటించింది. కెరీర్ పరంగా వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా పూజా కన్నన్ తన చిరకాల మిత్రుడు వినిత్ ప్రేమలో ఉంది. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇటీవల పూజ కన్నన్ తనకు కాబోయే భర్త వినిత్ అంటూ అభిమానులకు పరిచయం చేసింది.

ఈ క్రమంలోనే ఆదివారం పూజా కన్నన్, వినిత్ ల నిశ్చితార్థం వేడుకలు ఘనంగా జరిగింది. సాయి పల్లవి కన్నా పూజా కన్నన్ చిన్నదైనప్పటికీ.. అక్క కన్నా ముందుగానే పెళ్లి పీటలెక్కబోతుంది. ఇక ఆదివారం జరిగిన నిశ్చితార్థం వేడుకల అనంతరం సాయి పల్లవి తన కుటుంబ సభ్యులతో కలిసి డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేసింది. సాయి పల్లవి అంటే డ్యాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటారు.. ఆమె డ్యాన్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకొని ఎన్నో స్టేజ్ షోలు, రియాల్టీ షోల్లో పర్మామెన్స్ చేసింది. 2009 లో బుల్లితెరపై వచ్చిన ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో లో (ఢీ 4) లో తన డ్యాన్స్ తో జడ్జీలను, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. తాజాగా పూజా కన్నన్ ఎంగేజ్‌మెంట్ లో కుటుంబ సభ్యులతో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Saipallavi fan girl (@saipallavi_fan_girl00)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి