iDreamPost

ఇండియా vs శ్రీలంక మ్యాచ్‌! స్టేడియంలో దిగ్గజ క్రికెటర్‌ విగ్రహం ఆవిష్కరణ

  • Author Soma Sekhar Published - 02:50 PM, Thu - 2 November 23

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఆటగాడి విగ్రహం మాత్రమే మూడు వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్టించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం ఎవరిదంటే?

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఆటగాడి విగ్రహం మాత్రమే మూడు వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్టించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం ఎవరిదంటే?

  • Author Soma Sekhar Published - 02:50 PM, Thu - 2 November 23
ఇండియా vs శ్రీలంక మ్యాచ్‌! స్టేడియంలో దిగ్గజ క్రికెటర్‌ విగ్రహం ఆవిష్కరణ

సాధారణంగా ఏ రంగంలోనైనా అపార సేవలు అందించిన వ్యక్తులను పలు విధాలుగా సత్కరించడం దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా కొందరు సదరు వ్యక్తులకు సన్మానాలు చేస్తే.. మరికొందరు వారి సేవలకు గుర్తుగా వారి విగ్రహాలను ప్రతిష్టించి తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఇలా విగ్రహాలు పెట్టడం అనేది క్రీడా రంగంలో చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క ఆటగాడి విగ్రహం మాత్రమే మూడు వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్టించారు. అతడు ఎవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజం కల్నల్ సీకే నాయుడు విగ్రహం. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఆ విగ్రహం ఎవరిదంటే?

వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 2వ తారీఖున ఇండియా-శ్రీలంక తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా.. వాంఖడే స్టేడియంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ విగ్రహాన్ని బుధవారం(నవంబర్ 1) సాయంత్ర 5 గంటలకు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే, డిప్యూటీ సీఎం కూడా హాజరైయ్యారు. కాగా.. వాంఖడే స్టేడియంతో సచిన్ కు విడదీయరాని అనుబంధం ఉంది. సచిన్ తన మెుదటి రంజీ మ్యాచ్ ఈ గ్రౌండ్ లోనే ఆడాడు.

అదీకాక 28 సంవత్సరాల టీమిండియా చిరకాల స్వప్నం వరల్డ్ కప్ ను(2011) సాధించింది ఈ స్టేడియంలోనే. ఫైనల్ మ్యాచ్ లో లంకను చిత్తుచేసి వరల్డ్ కప్ ను ముద్దాడింది భారత జట్టు. మ్యాచ్ విజయం తర్వాత వాంఖడే మైదానంలో సచిన్ ను తమ భుజాలపై ఎక్కించుకుని ఊరేగింపు చేశారు టీమిండియా ఆటగాళ్లు. ఆ దృశ్యాలు ఇప్పటికీ ఫ్యాన్స్ లో మెదులుతూనే ఉన్నాయి. కాగా.. సచిన్ విగ్రహాన్ని అతడి 50 సంవత్సరాల కాలానికి అంకితం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సచిన్ తన 50 పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెటర్ చరిత్రలో విగ్రహం ఏర్పాటు చేసిన రెండో క్రికెటర్ గా సచిన్ నిలిచాడు. భారత క్రికెట్ లో విగ్రహం ఏర్పాటు చేసిన తొలి ఆటగాడిగా కల్నల్ సీకే నాయుడు నిలిచారు. ఆయన విగ్రహాలను మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వాంఖడే మైదానంలోని సచిన్ టెండుల్కర్ స్టాండ్ దగ్గర ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి క్రికెట్ గాడ్ సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి