iDreamPost

Sachin Tendulkar: వీడియో: అభిమానిని ఛేజ్‌ చేసి పట్టుకున్న సచిన్‌ టెండూల్కర్‌!

  • Published Feb 01, 2024 | 7:14 PMUpdated Feb 01, 2024 | 7:14 PM

ఇండియన్‌ క్రికెట్‌ సచిన్ టెండూల్కర్‌ను చూసేందుకు, ఆయనతో ఫొటో దికేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. కానీ, తొలి సారి సచిన్‌ తన అభిమానిని కలిసేందుకు ఛేజింగ్‌ చేశాడు. వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. పూర్తి వివరాలు చదవేయండి.

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కేవలం ఆయన ఆట చూసేందుకే అప్పట్లో చాలా మంది స్టేడియానికి పొటెత్తేవారు. సచిన్‌ ఆడుతున్నసేపు టీవీల్లో మ్యాచ్‌ చూసి.. సచిన్‌ అవుట్‌ అవ్వగానే టీవీలు కట్టేసేవారని ఇప్పటికీ చాలా మంది సీనియర్‌ క్రికెట్‌ అభిమానులు చెబుతుంటారు. అతి చిన్న వయసులోనే ఇండియన్‌ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన సచిన్‌.. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్లు.. క్రికెట్‌ లోకానికి దేవుడిగా ఎదిగాడు. అలాంటి సచిన్‌కు.. అతని అభిమానులంటే ఎంతో ప్రేమ.

తనను అమితంగా ఇష్టపడే అభిమానుల పట్ల సచిన్‌ కూడా అంతే ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా సచిన్‌కు తన అభిమానులంటే ఎంత అభిమానమో తెలిసొచ్చే ఘటన చోటు చేసుకుంది. ముంబై రోడ్లపై సచిన్‌ టెండూల్కర్‌ 10వ నంబర్‌ జెర్సీ వేసుకుని.. ఐ మిస్‌ యూ సచిన్‌ అనే క్యాప్షన్‌తో తిరుగుతున్న ఓ వ్యక్తి సచిన్‌ కంటపడ్డాడు. సచిన్‌ తన కారులో ఎక్కడికో వెళ్తున్న క్రమంలో.. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. అతను సచిన్‌ పేరు, నంబర్‌తో జెర్సీ ధరించి ఉన్నాడు. అతన్ని కారులోంచి చూసిన సచిన్‌.. ఛేజ్‌ చేయమని డ్రైవర్‌ను ఆదేశించాడు.

అంతే.. సచిన్‌ కారు డ్రైవర్‌ ఆ వ్యక్తిని ఓవర్‌ టేక్‌ చేసి, కారు ఆపాడు. ఎవరబ్బా నన్ను ఆపింది అంటూ ఆ వ్యక్తి ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. కానీ, తనను ఆపింది ఎవరో కాదు.. తాను ఎంతగానో అభిమానించే క్రికెట్‌ దేవుడు సచిన్‌ అని తెలియగానే అతని సంతోషం చూడాలి. అతని కళ్లు నీళ్లతో నిండిపోయాయి. రెండు చేతులెత్తి సచిన్‌కు దండం పెడుతూ.. సచిన్‌ను కలిసిన తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోయాడు. కానీ, అతని కళ్లలో సచిన్‌పై అతనికున్న ప్రేమ మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే.. ఒక అభిమానిని కలిసేందుకు సాక్ష్యాత్తు సచిన్‌ టెండూల్కర్‌ తన కారుతో ఛేజ్‌ చేసి మరి కలవడం విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి