iDreamPost

Sachin Tendulkar: నీలో ఇంకా సత్తా తగ్గలేదు! సచిన్.. ఇందుకే నిన్ను క్రికెట్ గాడ్ అనేది!

50 సంవత్సరాల వయసులోనూ తన ఆటతో దుమ్మురేపుతున్నాడు సచిన్ టెండుల్కర్. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ 2024 కప్ లో పాత టెండుల్కర్ ను అభిమానులకు చూపించాడు మాస్టర్ బ్లాస్టర్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

50 సంవత్సరాల వయసులోనూ తన ఆటతో దుమ్మురేపుతున్నాడు సచిన్ టెండుల్కర్. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ 2024 కప్ లో పాత టెండుల్కర్ ను అభిమానులకు చూపించాడు మాస్టర్ బ్లాస్టర్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Sachin Tendulkar: నీలో ఇంకా సత్తా తగ్గలేదు! సచిన్.. ఇందుకే నిన్ను క్రికెట్ గాడ్ అనేది!

సచిన్ టెండుల్కర్.. క్రికెట్ ప్రపంచానికి ఓ దేవుడు. వరల్డ్ వైడ్ గా తన ఆటతో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ మాస్టర్ బ్లాస్టర్. ఇక లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకుని రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. అయితే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక కొన్ని టీ20 లీగుల్లో మాత్రమే దర్శనమిస్తున్నాడు సచిన్. లెజెండ్స్ లీగ్, వరల్డ్ సేఫ్టీ లీగ్ లాంటి వాటిల్లో మాత్రమే ఆడుతూ.. అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. అయితే 50 సంవత్సరాల వయసులోనూ టీనేజ్ లో ఎలా ఆడేవాడో.. అలానే ఆడుతున్నాడు ఈ దిగ్గజ ఆటగాడు. తాజాగా జరుగుతున్న ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ 2024’ టోర్నీలో అదరగొట్టాడు. గ్రౌండ్ లోకి దిగిన సచిన్ తనలో ఇంకా ఆ కుర్రతనం పోలేదని నిరూపించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సచిన్ టెండుల్కర్.. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. దీంతో అతడు ముసలోడు అయిపోయాడని అందరూ అనుకుంటున్నారు. కానీ తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో సచిన్ ప్రదర్శన చూస్తే.. యంగ్ ప్లేయర్లు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్రౌండ్ లో చిరుత పులిలా కదులుతున్నాడు. ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ 2024’ టోర్నీలో భాగంగా వన్ వరల్డ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే వన్ ఫ్యామిలీ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో తన మాస్టర్ స్టోక్ ప్లేతో అదరగొట్టాడు. చేసింది తక్కువ పరుగులే అయినప్పటికీ.. టీనేజ్ సచిన్ ను గుర్తుకుతెచ్చాడు. ఈ మ్యాచ్ లో కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు, ఓ సిక్స్ తో 27 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు మాస్టర్ బ్లాస్టర్. అద్భుతమైన స్టోక్ ప్లేతో, తన మార్క్ షాట్లతో అభిమానులను మరోసారి అలరించాడు.

ఇక అతడు గ్రౌండ్ లోకి దిగగానే సచిన్.. సచిన్.. అంటూ గ్రౌండ్ ను మెుత్తం హోరెత్తించారు ప్రేక్షకులు. షాట్ కొట్టినప్పుడల్లా.. సచిన్ నినాదాలతో స్టేడియం మెుత్తం దద్దరిల్లింది. ఈ ఏజ్ లో కూడా 168 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి, ఔరా అనిపించాడు మాస్టర్ బ్లాస్టర్. బ్యాటింగే కాదు.. దుమ్మురేపే బౌలింగ్ తో కూడా సత్తా చాటాడు. బౌలింగ్ లో వికెట్ కూడా తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సచిన్ బ్యాటింగ్, బౌలింగ్ చూసిన అభిమానులు, నెటిజన్లు నీలో ఆ కుర్రతనం ఇంకా తగ్గలేదు సచిన్.. అంటూ కితాబిస్తున్నారు. అందుకే నిన్ను క్రికెట్ గాడ్ అనేది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వన్ వరల్డ్ టీమ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి 50 ఏళ్ల వయసులోనూ సచిన్ గ్రౌండ్ లో దుమ్మురేపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి