iDreamPost

వరలక్ష్మి విషయంలో స్వార్థంగా ఆలోచించాను: శబరి దర్శకుడు

డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాత్రలతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్.. శబరి సినిమాతో హీరోయిన్ గా అలరించనున్నారు. అయితే వరలక్ష్మి విషయంలో శబరి దర్శకుడు స్వార్థంగా ఆలోచించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాత్రలతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్.. శబరి సినిమాతో హీరోయిన్ గా అలరించనున్నారు. అయితే వరలక్ష్మి విషయంలో శబరి దర్శకుడు స్వార్థంగా ఆలోచించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

వరలక్ష్మి విషయంలో స్వార్థంగా ఆలోచించాను: శబరి దర్శకుడు

లేడీ డైనమిక్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ నటిగా సత్తా చాటుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారంటే.. ఆ సినిమా కొత్తగా ఉంటుంది.. ఖచ్చితంగా బాగుంటుంది అన్న అభిప్రాయానికి జనాలు వచ్చేలా ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ ఉంటుంది. ఆ విషయం రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీతో మరోసారి రుజువైంది. అయితే ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన వరలక్ష్మి.. ఈసారి హీరోయిన్ గా మన ముందుకు వస్తున్నారు. శబరి అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే దర్శకుడు అనిల్ వరలక్ష్మి శరత్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

శబరి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆర్టిస్టులు భారతీయ సినీ పరిశ్రమలో చాలా తక్కువ మందే ఉన్నారని అన్నారు. ఇలాంటి పాత్రలో అన్ని రకాల వేరియేషన్స్ ని చూపించగల నటి ఎవరున్నారా అని ఆలోచిస్తే.. వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించారని అన్నారు. ఆమె విలన్ గా నటించిన పందెం కోడి 2, విక్రమ్ వేద, తార తప్పటై, సర్కార్ సినిమాల్లో విలన్ గా ఆమె నటన అద్భుతం అని ప్రశంసించారు. ఆన్ స్క్రీన్ లో ఆమె చేసే పాత్రలే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లో ఆమె క్యారెక్టర్ కూడా తనకు బాగా నచ్చుతుందని అన్నారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశానని.. ఆమె స్వభావం తనకు నచ్చిందని అన్నారు.

అలానే కథలో చెప్పాలనుకున్న విషయాలను నటీనటులు నమ్ముతున్నారా లేదా అనేది చాలా ముఖ్యం అని.. వాళ్ళు నమ్మితేనే అది ముఖంలో కనిపిస్తుందని అన్నారు. అదే సినిమాకి హెల్ప్ అవుతుందని.. అందుకే ఒక దర్శకుడిగా కేవలం స్వార్థంతోనే వరలక్ష్మి శరత్ కుమార్ ని ఈ మూవీలో లీడ్ రోల్ కి తీసుకున్నా అని అనిల్ కాట్జ్ వెల్లడించారు. సినిమాకి ప్లస్ అవుతుందనే ఆమెను సంప్రదించానని.. చెన్నైలో స్టోరీ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారని అన్నారు. కథలో పెద్ద మార్పులు కూడా ఆమె ఏమీ చెప్పలేదని.. ఆమె డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని అన్నారు. ఆమె డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేయడం వల్ల ఆమెకు కెమెరా, షాట్స్ పై అవగాహన ఉందని.. దీని వల్ల సీన్స్ గురించి ఆమెకు ఎక్కువగా వివరించే అవసరం రాలేదని అనిల్ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి