iDreamPost

KL రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు భారీ బ్యాడ్‌న్యూస్‌!

  • Published Apr 20, 2024 | 9:52 AMUpdated Apr 20, 2024 | 9:52 AM

Ruturaj Gaikwad, KL Rahul: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో గెలిచిన కెప్టెన్‌కు అలాగే ఓడిన కెప్టెన్‌కు పెద్దగా తేడా లేకుండా పోయింది. ఇంతకీ వారిద్దరికి అందిన బ్యాడ్‌ న్యూస్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Ruturaj Gaikwad, KL Rahul: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో గెలిచిన కెప్టెన్‌కు అలాగే ఓడిన కెప్టెన్‌కు పెద్దగా తేడా లేకుండా పోయింది. ఇంతకీ వారిద్దరికి అందిన బ్యాడ్‌ న్యూస్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 20, 2024 | 9:52 AMUpdated Apr 20, 2024 | 9:52 AM
KL రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు భారీ బ్యాడ్‌న్యూస్‌!

ఐపీఎల్‌ 2024లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ఘన విజయం సాధించింది. అయితే.. మ్యాచ్‌లో గెలిచిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు సంతోషం లేకుండా పోయింది. అలాగని, ఓడిపోయిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు బాధ మరింత ఎక్కువ అయింది. అది ఎలాగంటే.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇరు జట్ల కెప్లెన్లకు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించారు. కేఎల్‌ రాహుల్‌కు రూ.12 లక్షలు, అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌ ఫైన్‌ను వారి మ్యాచ్‌ ఫీజు నుంచి తీసుకుంటారు. అయితే.. కేవలం రూ.12 లక్షలకు వారికి పెద్ద మ్యాటర్‌ కాదని ఫ్యాన్స్‌ అంటున్నారు. కానీ, ఈ స్లో ఓవర్‌ రేట్‌ మరో రెండు సార్లు ఇలాగే కొనసాగితే.. కెప్టెన్లపై ఒక మ్యాచ్‌ నిషేధం విధించే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనా.. ఇది కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌లకు బ్యాడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. వారి టీమ్స్‌కు వారే ప్రధాన బలం. అలాంటిది.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా కీలకమైన మ్యాచ్‌లకు వీరు దూరమైతే.. ఆయా జట్లకు ఇబ్బందే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర గోల్డెన్‌ డక్‌ అవ్వడంతో చెన్నైకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరో ఓపెనర్‌ అజింక్యా రహానె మాత్రం 24 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు చేశాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వచ్చిన రవీంద్ర జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసి రాణించాడు. ఫామ్‌లో ఉన్న శివమ్‌ దూబే 3, సమీర్‌ రిజ్వి 1 ఈ మ్యాచ్లో నిరాశపర్చారు. చివర్లో మొయిన్‌ అలీ 20 బంతుల్లో 30, ధోని 9 బంతుల్లో 28 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ పాండ్యా 2, మోషిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, స్టోయినీస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేసి.. అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయం అందించాడు. అలాగే ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేసి రాణించాడు. అలాగే నికోలస్‌ పూరన్‌ 23 పరుగులు చేశాడు. మొత్తం లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లో నాలుగో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌కు జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి