iDreamPost

Rushikonda: రుషికొండపై విష ప్రచారం.. విపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చిన CM జగన్‌

  • Published Mar 01, 2024 | 11:14 AMUpdated Mar 01, 2024 | 11:14 AM

రుషికొండపై విపక్షాలు చేస్తోన్న విష ప్రచారానికి సీఎం జగన్‌ చెక్‌ పెట్టారు. ఒక్క నిర్ణయంతో వారి నోళ్లు మూయించారు. ఆ వివరాలు..

రుషికొండపై విపక్షాలు చేస్తోన్న విష ప్రచారానికి సీఎం జగన్‌ చెక్‌ పెట్టారు. ఒక్క నిర్ణయంతో వారి నోళ్లు మూయించారు. ఆ వివరాలు..

  • Published Mar 01, 2024 | 11:14 AMUpdated Mar 01, 2024 | 11:14 AM
Rushikonda: రుషికొండపై విష ప్రచారం.. విపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చిన CM జగన్‌

తాము చేయలేని పనులు చేస్తూ.. సంక్షేమ పాలనకు నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తూ.. ప్రజల సంతోషం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా అయినా సరే అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. అందుకోసం.. తమ అనుకూల మీడియాతో విషప్రచారానికి దిగాయి. జగన్‌ చేసే ప్రతి పనిని తప్పు పట్టడం.. దానిపై అసత్య ప్రచారం చేస్తూ.. మీడియాలో అవాస్తవాలు చెప్తూ.. జనాలను భయభ్రాంతాలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నాయి. దానిలో భాగంగానే కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలోని రుషికొండ గురించి కూడా అసత్య ప్రచారానికి దిగారు విపక్ష నేతలు. అయితే వారికి దిమ్మ తిరిగి పోయే షాకిచ్చారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

జగన్‌ సర్కార్‌ విశాఖ రుషికొండ వద్ద అత్యాధునికంగా నిర్మించిన పర్యాటక భవనాలను జాతికి అంకితం చేసింది. ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా ఈ భవనాలను ప్రారంభించారు. సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాల వినియోగానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ భవనాలు నిర్మించిన చోట గతంలో హరిత రిసార్టులు ఉండేవి. ఇక ఈ భవన నిర్మాణాల సందర్భంగా విపక్షాలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అనుమతులు లేకుండానే జగన్‌ అక్కడ సొంత భవనాలు నిర్మిస్తున్నారు అని ప్రచారం చేశారు.

విపక్షాల ప్రచారాలకు తన చర్యలతో గట్టిగా సమాధానం చెప్పారు. ఇన్నాళ్లు చేస్తోన్న అసత్య ప్రచారాలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ.. ఈ భవనాలను జాతికి అంకితం చేశారు. జగన్‌ చర్యలతో ఇది ప్రభుత్వ భవనాలే.. టూరిస్టులు ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పి.. మరోసారి వైసీపీ సర్కార్‌ తన పారదర్శకతను చాటుకుంది. దీనిపై నానా రచ్చ చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని భావించిన విపక్షాలు జగన్‌ కొట్టిన దెబ్బకు కిక్కురుమనడం లేదు. ఎన్నికల వేళ రుషికొండ వివాదాన్ని ఎంతో సింపుల్‌గా ముగించి.. విపక్షానికి వైసీపీ ఝలక్ ఇచ్చేసింది. 2024లో గెలిచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు.

భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా విశాఖ పర్యాటక ప్రాంతంగా పేరు గడించింది. ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూంటారు. విశాఖ నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అందుకే పర్యాటక శాఖ భవనాలు పునర్ నిర్మించాము. ఈ విషయంలో అన్ని రకాలైన అనుమతులు తీసుకుని.. పూర్తిగా పర్యావరణానికి తగినట్లుగా నిర్మాణం చేపట్టాము’’ అని వివరించారు. అంతేకాక ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆమె హింట్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ దీని మీద నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం దీని మీద ఎపుడు నిర్ణయం తీసుకుంటే అప్పటి నుంచే సీఎం విశాఖలో క్యాంప్ ఆఫీసుని ప్రారంభిస్తారు అని రోజా ఆసక్తికరమైన వార్త వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి