iDreamPost

Vijay Deverakonda & Rashmika Mandanna : మళ్ళీ విజయ్ -రష్మికల ప్రేమ ప్రచారం.. ఆ ఫోటోల ఎఫెక్ట్ తో!

Vijay Deverakonda & Rashmika Mandanna : మళ్ళీ విజయ్ -రష్మికల ప్రేమ ప్రచారం.. ఆ ఫోటోల ఎఫెక్ట్ తో!

కన్నడ భామ రష్మిక మందన్నాకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు ఒక రకంగా తెలుగులో టాప్ హీరోయిన్ పొజిషన్లో ఉంది. ఆమె తెలుగులో ఛలో సినిమా చేసేనాటికే కన్నడలో కిరిక్ పార్టీ అనే ఒక సినిమా చేయగా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి హీరోతో ప్రేమలో పడిన ఈ భామ ఎక్కువ రోజులు వృధా చేయకుండా నిశ్చితార్థం కూడా చేసేసుకుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఛలో సినిమా చేయడం సూపర్ హిట్ కావడంతో గీత గోవిందం ఆమెకు అవకాశం రావడంతో పాటు ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఊహించని విధంగా విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాలో ముద్దు సీన్లో నటించాల్సి రావడంతో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆమె నటించేసి మంచి పేరు తెచ్చుకుంది. అనుకోని పరిస్థితుల్లో వారి నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తెలుగులో మంచి స్టార్ డమ్ లభిస్తుండడంతో రష్మిక కొన్నాళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేయాలని భావించిందని అందుకే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని ఆమె సన్నిహితులు అప్పట్లో మీడియాకు లీకులు ఇచ్చారు.

కానీ అప్పటి నుంచి కూడా ఆమెకు విజయ్ దేవరకొండతో ప్రేమ మొదలైందని రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ముంబైలో కూడా ఈ ఇద్దరూ కలిసి కెమెరాలకు చిక్కడంతో ఇంకేముంది వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వాదనలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఆమె న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందని చెబుతూ తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విషయం ఏమిటంటే నూతన సంవత్సరాది సందర్భంగా రష్మిక మందన్న తన ఫోటో ఒకదానిని షేర్ చేసి నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఫోటో షేర్ చేసిన గంట సేపటికి విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా తాను ఒక ఫోటో షేర్ చేసి తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ రష్మిక మందన ఫోటోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ విజయ్ తమ్ముడు ఫోటోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ రెండు ఒకటే. ఆనంద్ దేవరకొండ ఫోటోలో విజయ్ దేవరకొండ చేయి కూడా కనిపిస్తోంది. అంటే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రష్మిక మందన ముగ్గురు ఒక్కచోటే ఉన్నారు అన్నమాట. సో విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి రష్మిక మందన నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నదని ఇద్దరి మధ్య ఏదో ఉంది అని మళ్ళి నెటిజన్లు గోల చేయడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పటికే భీభత్సంగా పెరిగిపోగా రష్మిక మందన్న కూడా తన క్రేజ్ పెంచుకునే పనిలో పడింది. ఆమె నటించిన పుష్ప సినిమా ఒక పక్క తెలుగులో సహా మిగతా అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ ఉండగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా భాగం అవుతుందని తెలుస్తోంది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

Also Read : Allu Arjun : సరైనోడు కాంబినేషన్ లో స్పెషల్ ఇదే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి