iDreamPost

రికార్డు సృష్టించిన ఆర్టీసీ.. ఒకే రోజు లక్షల్లో

  • Published Dec 13, 2023 | 10:30 AMUpdated Dec 13, 2023 | 10:30 AM

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు.

  • Published Dec 13, 2023 | 10:30 AMUpdated Dec 13, 2023 | 10:30 AM
రికార్డు సృష్టించిన ఆర్టీసీ.. ఒకే రోజు లక్షల్లో

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అప్పుడే తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. అదే సమయంలో గతంలో తాను నిరుద్యోగ దివ్యాంగురాలైన రజినీకి ఉద్యోగం అవకాశం కల్పించడమే కాదు.. సభవేదికపైనే ఆమెకు నియాక పత్రాన్ని కూడా అందజేశారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో ఉద్యోగాలు చేసుకునే వారు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్తీక మాసం సందర్బంగా గృహినులు దేవాలయాలు దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులు ప్రయాణించడంతో ఒక్కసారిగా రద్దీ బాగా పెరిగిపోయింది. ఒక దశలో ఆర్టీసీ చరిత్రలో రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇన్నాళ్లూ గడపదాటని మహిళలు సైతం తమ పనుల నిమిత్తం ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్టాండ్లు మహిళలతో కళకళలాడుతున్నాయి. ఒకదశలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం మహిళలు ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉచిత బస్ సౌకర్యం వల్ల ఎన్నో మహిళలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. మహిళలకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నారవాణా ఖర్చు భారంతో ఇంట్లో వారు పంపించలేదు. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యంతో ఆ కష్టాలు తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

tsrtc create history

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో మహిళలు ప్రయాణం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ మునిషేకర్ తెలిపారు. ఆదివారం సుమారు 41 లక్షలు.. సోమవారం నాటికి మరో తొమ్మది లక్షల మంది పెరిగినట్లు ఆయన వెల్లడించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. అయితే ముందుగానే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రెగ్యూలర్ బస్సులతో పాటు అదనంగా బస్సులను నడిపించామని ఆయన తెలిపారు. డ్రైవర్లు, కండక్లర్లు వీక్ ఎండ్ సెలవు తీసుకోకుండా తమ విధులు నిర్వహించారని అన్నారు. ప్రతిరోజూ ఎంత మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్న విషయాన్ని నమోదు చేసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారు తెలిపారు. మరి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి