iDreamPost

ఆకాశమే హద్దు – RRR ప్రీ రిలీజ్ బిజినెస్

ఆకాశమే హద్దు – RRR ప్రీ రిలీజ్ బిజినెస్

ఇంకా విడుదలకు ఏడాది టైం ఉన్నా ఆర్ఆర్ఆర్ అప్పుడే సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్క నెల్లూరు తప్ప మిగిలిన ఏరియాలకి డీల్స్ పూర్తయ్యాయని టాక్. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 200 కోట్ల దాకా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయిన ఈ రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ రికార్డుల విషయంలో రేగబోయే సునామికి ముందస్తు సంకేతాలు ఇస్తోంది. ఇందులో ఓవర్సీస్ కలపలేదు.

డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ తదితర హక్కులకు సంబంధించి ఎంత మొత్తం ఫైనల్ అవుతుందో ఊహకందడం కూడా కష్టమే. అత్యధికంగా నైజామ్ ఏరియాను దిల్ రాజు 72 కోట్లకు సీల్ చేసినట్టు తెలిసింది. ఈ లెక్కన నాన్ బాహుబలి అంటూ చెప్పుకుంటూ వస్తున్న రికార్డులు వచ్చే ఏడాది నుంచి నాన్ ఆర్ఆర్ఆర్ పేరుతో మారేలా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఇద్దరి అభిమానుల అంచనాలకు హద్దు లేకుండా పోతోంది.

బ్రిటిష్ కాలంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు కలిసి పోరాడితే ఎలా ఉంటుందన్న ఫిక్షనల్ పాయింట్ తో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇది విలన్ గానా లేక ఇంకేదైనా అనే క్లారిటీ లేదు. కీరవాణి సంగీతంలో సాయి మాధవ్ బుర్రా సంగీతం అందిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇంత అడ్వాన్స్ గా రికార్డుల ఊచకోత మొదలుపెట్టడం చూసి ట్రేడ్ వర్గాలు నివ్వెరపోతున్నాయి. ఏరియా ల వారీగా ప్రీ రిలీజ్ ఫిగర్స్ ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ఏరియా  బిజినెస్ 
నైజాం  72.00cr
సీడెడ్   30.00cr
ఉత్తరాంధ్ర  26.00cr
గుంటూరు   20.00cr
క్రిష్ణ   15.00cr
ఈస్ట్ గోదావరి  18.00cr
వెస్ట్ గోదావరి  14.00cr

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి